ప్రాథమిక లివర్‌ క్యాన్సర్‌ను(Liver Cancer) హెపాటో సెల్లర్ కార్సినోమా (Hepatocellular carcinoma) అని కూడా పిలుస్తారు. ప్రధానంగా కాలేయ కణాలలో ఉద్భవించే ఒక రకమైన క్యాన్సర్. మన దేశంలో ప్రాథమిక లివర్‌ క్యాన్సర్ పురుషులలో 4 శాతం నుంచి 7.5 శాతం వరకు.. లక్ష మంది స్త్రీలలో 1.2 శాతం నుంచి 2.2 శాతం వరకు వరకు వస్తుందని తేలుస్తోంది. ప్రారంభ దశల్లో ఈ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉండే అకవాశం ఉంది.

కాలేయంలో కణితి పెరుగుతున్నప్పుడు, చుట్టుపక్కల కణజాలంపై ఒత్తిడిని కలిగించినప్పుడు పొత్తికడుపు పైభాగంలో(Upper abdomen) నిరంతరం నొప్పి వచ్చే అవకాశం ఉందంటున్నారు. చర్మం(Skin), కళ్లు(Eyes) పసుపు రంగులోకి మారడం (కామెర్లు) సాధారణ లక్షణం, ఇందుకు బలహీనమైన లివర్‌ పనితీరు, బిలిరుబిన్ పేరుకుపోవడమే కారణమంటున్నారు. పొత్తికడుపు లేదా కాళ్లలో వాపు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. వేగంగా బరువు తగ్గడం కాలేయ క్యాన్సర్‌తో సహా వివిధ క్యాన్సర్‌లకు సంకేతం. తినాలనే కోరిక తగ్గడం కూడా కాలేయ క్యాన్సర్‌ లక్షణమేనంటున్నారు నిపుణులు. లివర్‌ పనితీరు బాగాలేనప్పుడు వికారం, వాంతులు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసి లివర్‌ క్యాన్సర్‌ను గుర్తించాలని సూచిస్తున్నారు

హెపటైటిస్-బీ వైరస్ (హెచ్‌బీవీ) లేదా హెపటైటిస్-సీ వైరస్ (HCV) ఇన్ఫెక్షన్‌ కాలేయ క్యాన్సర్(Liver Infection Cancer) ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ అంటువ్యాధులు దీర్ఘకాలిక కాలేయ వాపు, సిర్రోసిస్, చివరికి క్యాన్సర్ కణాల అభివృద్ధికి దారితీస్తుంది. లివర్‌ క్యాన్సర్‌కు ముఖ్య కారణం సిరోసిస్. అతి ఎక్కువగా మద్యం సేవించడం వల్ల కాలేయ క్యాన్సర్‌ బారిన పడే అవకాశముందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌తో(Alcoholic Fatty Liver) క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉందని చెప్పారు. మధుమేహం ఉన్న వ్యక్తులు, మధుమేహం నియంత్రించలేని వ్యక్తులు ఈ లివర్‌ క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఊబకాయం కూడా లివర్‌ క్యాన్సర్‌కు ఒక కారణమంటున్నారు. అంతేకాదు హెమోక్రోమాటోసిస్, విల్సన్స్ వంటి కొన్ని వంశపారంపర్య వ్యాధులు కూడా కాలేయ క్యాన్సర్‌కు కారకాలంటున్నారు. లివర్‌ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, మద్యాన్ని అతిగా తీసుకోకుండా, హెపటైటిస్‌ ఇంజెక్షన్లు వాడడంతో దీనిని నివారించే అవకాశముందని చెప్తున్నారు.

Updated On 29 Nov 2023 5:37 AM GMT
Ehatv

Ehatv

Next Story