ప్రస్తుత కాలంలో పెరుగుతున్న చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారి శరీరానికి సరిపడా ఆహారం ఇవ్వడం తప్పనిసరి.అయితే అందరు పిల్లలు అన్నీ తినరు.. దాంతో పేరెంట్స్ కు ఇది పెద్ద సమస్యగా మారుతుంది.
చిన్నా పెద్దా తేడా లేకుండా.. డ్రై ఫ్రూట్స్(Dry Fruits) అందరికీ ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి. మరీముఖ్యంగా ఎదిగే పిల్లలకు డ్రైఫ్రూట్స్ వల్ల పోషకాలు అంది.. లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అందులో వాల్ నట్స్ ను డైలీ పిల్లలకు నానబెట్టి ఇవ్వడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారి శరీరానికి సరిపడా ఆహారం ఇవ్వడం తప్పనిసరి.అయితే అందరు పిల్లలు అన్నీ తినరు.. దాంతో పేరెంట్స్ కు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఇక పిల్లలకు పోషకాహారం ఇవ్వడం వారి మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఈ విషయాలను డాక్టర్లు కూడా దృవీకరిస్తున్నారు.
అందుకే వాల్‌నట్స్(Walnuts) ను రోజు పిల్లలు తినేలా అలవాటు చేయండి. వాటికి రుచిగా ఉండే పదార్ధాలు కలిపి ఇవ్వండి. దాని వల్ల వారి ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారం అవుతాము. వీటికి రుచిని ఆడ్ యేయడం వల్ల.. అవి శిశువు నాలుకకు రుచిని అందించి ఎక్కువ తినేలా చేస్తాయి. పిల్లలకు వాల్‌నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అర్ధం అయ్యేలా చెప్పండి.
వాల్‌నట్‌లు చిన్నవిగా ఉన్నప్పటికీ, అవి పోషకాలతో నిండి ఉంటాయి. ఇది పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, పీచు పిల్లల ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. ఇది మెదడు కార్యకలాపాలను పెంచుతుందని చెప్పారు.
వాల్‌నట్ శిశువు ఆరోగ్యానికి దాని స్వంత సహకారం అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి మరియు ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. వాల్ నట్స్ తినడం వల్ల పిల్లలకు ఎలాంటి గుండె సమస్యలు దరిచేరవు మరియు వారి ఎముకలు రోజురోజుకు దృఢంగా మారుతాయి.
పిల్లలు పెరిగే వయసులో వాల్ నట్స్ తినడం వల్ల శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. దీని వల్ల పిల్లల శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలై ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కాబట్టి పిల్లలకు ఇష్టమైన ఈ ఫుడ్ ఐటమ్‌లో ఇది ప్రముఖంగా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.