Happy women's day 2025 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన "అంతర్జాతీయ మహిళా దినోత్సవం"

ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన "అంతర్జాతీయ మహిళా దినోత్సవం"
'వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి' అన్నారో కవి.
స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె గమనమే లేదు,స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు అని అర్థం.
నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర వేస్తుంది స్త్రీ. కాగా..(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు.
ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగామాట్లాడుతారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊరికే రాలేదు.. ఓ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన విషయం మీకు తెలుసా…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది.
1908లో 15,000 మంది మహిళలు ఇతర కొన్ని విషయాలతోపాటు మెరుగైన వేతనం, ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరం గుండా కవాతు చేశారు.
1910లో, జర్మనీలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీకి ‘మహిళా కార్యాలయం’ నాయకురాలిగా ఉన్న క్లారా జెట్‌కిన్ అనే మహిళ, మహిళల డిమాండ్‌ల కోసం ఒత్తిడి చేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రవేశపెట్టారు.
17 దేశాల నుంచి 100 మందికి పైగా మహిళలతో జరిగిన సమావేశం ఏకగ్రీవ ఆమోదంతో జెట్‌కిన్ సూచనను ఆమోదించింది.
1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1913లో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీని మార్చి 8కి మార్చారు. ప్రతి సంవత్సరం అదే రోజున నిర్వహిస్తున్నారు.
2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మహిళా దినోత్సవాన్ని పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తారు.
పర్పుల్ న్యాయానికి, హుందాతనానికి గుర్తు, పచ్చదనం ఆశావాదానికి, తెలుపు స్వచ్ఛతకు గుర్తు. ఈ రంగులను ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ ప్రతిపాదించిన మీదట యునైటెడ్ కింగ్ డమ్ కేటాయించింది.
అప్పటి నుంచి శతాబ్దానికి పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా ..(మార్చి 8) నిర్వహిస్తున్నారు.
మహిళా లందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
