Hair Fall Remedies : ఆరోగ్యకరమైన జుట్టుకోసం ఈ మూడు రకాల పండ్లు ఇలా చేయండి....?
ఈరోజుల్లో జుట్టు సమస్య సర్వసాధారణం అయ్యింది. ఎవరికి చూసినా... హెయిర్ ఫాల్(Hair fall)..బట్టతల...పెద్ద సమస్యగా మారింది. అయితే దీని నివారణ కోసం పై పూతలు మాత్రమే కాదు.. తీసుకునేు ఆహారం కూడా సరిగ్గా ఉండాలి.
ఈరోజుల్లో జుట్టు సమస్య సర్వసాధారణం అయ్యింది. ఎవరికి చూసినా... హెయిర్ ఫాల్(Hair fall)..బట్టతల...పెద్ద సమస్యగా మారింది. అయితే దీని నివారణ కోసం పై పూతలు మాత్రమే కాదు.. తీసుకునేు ఆహారం కూడా సరిగ్గా ఉండాలి. ఆరోగ్య కరమైన ఆహారం(Healthy Food) తీసుకుంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ ను నియంత్రించడానికి పై పూతలుగా వాడే మూడు రకాల పండ్ల గురించి తెలుసుకుందాం..
బొప్పాయి(Pappaya)
బొప్పాయి సహజ చర్మ కణాలను మరియు జుట్టును శుభ్రపరుస్తుంది. అలా పండిన బొప్పాయిలో పాలు, పెరుగు వేసి బాగా మెత్తగా చేసి జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు నానబెట్టి తలస్నానం చేయాలి.
అరటి(Banana)
మీ జుట్టుకు తగిన మొత్తంలో అరటిపండును తీసుకుని, దానిని బాగా మెత్తగా చేసి, కొద్దిగా పెరుగు మరియు నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత, దానిని తలకు మరియు జుట్టుకు రుద్దండి మరియు 30 నిమిషాలు నాననివ్వండి. తర్వాత చల్లటి నీరు మరియు షాంపూతో కడిగేయండి. దీంతో జుట్టు సిల్కీగా, మృదువుగా మారుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది.
జామ(Guva)
జామలో ఉండే విటమిన్ ఎ జుట్టు పెరుగుదలకు మరియు దెబ్బతిన్న కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. అందుకోసం బాగా పండిన జామ పండును తీసుకుని బాగా మెత్తగా చేసి అందులో కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. దీన్ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. దీంతో చుండ్రు పోతుంది.