అమ్మాయిలకైనా అబ్బాయిలకైన జుట్టే అందం...ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలటం. చిన్న వయసుకే యువతీ, యువకుల్లో జుట్టు రాలడం అధికమవుతోంది. జుట్టు పొడవుగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తారు. అందం తో పాటు ఆత్మ విశ్వాసం గా కనిపిస్తారు అయితే ఈ మద్యకాలంలో అలాంటి పొడవు జుట్టు ఉన్నవారిని.. ఒత్తైన జట్టు ఉన్నవారిని చాలా అరుదుగా చూస్తున్నాము.. ప్యాషన్ అంటూ కొంత మంది జుట్టును పాడు చేసుకుంటే.. మరికొంత మందికి జీవనశైలిలో మార్పులు నిద్రలేమి, […]

అమ్మాయిలకైనా అబ్బాయిలకైన జుట్టే అందం...ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలటం. చిన్న వయసుకే యువతీ, యువకుల్లో జుట్టు రాలడం అధికమవుతోంది. జుట్టు పొడవుగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తారు. అందం తో పాటు ఆత్మ విశ్వాసం గా కనిపిస్తారు అయితే ఈ మద్యకాలంలో అలాంటి పొడవు జుట్టు ఉన్నవారిని.. ఒత్తైన జట్టు ఉన్నవారిని చాలా అరుదుగా చూస్తున్నాము.. ప్యాషన్ అంటూ కొంత మంది జుట్టును పాడు చేసుకుంటే.. మరికొంత మందికి జీవనశైలిలో మార్పులు నిద్రలేమి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు ఎక్కువగా ఉడిపోతుందని ఎక్కువ మంది చెబుతుంటారు. జుట్టు పెరుగుదల కోసం మనం ఇంట్లోనే కొన్ని హెయిర్ కేర్ టిప్స్ తెలుసుకుందాం.

మెంతులు:
జుట్టు పెరుగుదలకు ఒక సాధారణ ఔషధం మెంతులు అని చెప్పవచ్చు. జట్టు పెరుగుదల తో పాటు మెరుపును పెంచడంలో సహాయపడటమే కాకుండా చుండ్రు చికిత్సకు కూడా మెంతులు ఉపయోగపడతాయి.
ఒక పాన్‌లో 2 చెంచాల ఆలివ్, కొబ్బరి, ఆముదం జోడించండి. దానికి 2 చెంచాల మెంతి గింజలు వేసి 5 నిమిషాలు మరిగించ౦డి. ఆ తర్వాత మె౦తులను వడకట్టిన ఆ నూనెను ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి . తలకు గోరువెచ్చని నూనె రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం రాత్రిపూట అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయం కడిగేయండి. నెలకు రెండుసార్లు ప్రతి వారం ఇలా చేస్తే సరిపోతుంది

గ్రీన్ టీ :
ఇది చాలా మందికి వింతగా లేదా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. కానీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ పదార్థాల ఎక్కువగా ఉంటాయి. ఇది కొత్త హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలతోపాటు.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోండి. అది గోరువెచ్చగా మారిన తర్వాత.. దానిని వెంట్రుకల కుదుళ్లకు మసాజ్ చేసుకోవాలి. తల అంతా గ్రీన్ టీ చేరిపోయేలా చూసుకోండి . కడిగే ముందు కనీసం ఒక గంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మంచి నీటితో కడగండి. ఇలా నెలలో రెండు సార్లు చేయండి.

ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు ఎంతో దోహద పడుతుంది . ఇది జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా పాత జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పొట్టు తీయండి. ఆ తర్వాత దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి సెమీ లిక్విడ్ స్థితిలో చూర్ణం చేయండి. ద్రవాన్ని వడకట్టి దానిని జుట్టుకి అప్లై చేసుకొని ... సుమారు 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. జుట్టును ఎప్పటిలాగే కడగడానికి ముందు కనీసం 15 నిమిషాలు అలాగే ఉంచండి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయండి.

అలోవెరా జెల్:
అనేక ప్రయోజనాలకు అలోవెరా జెల్ పేరు గాంచింది. దీనిని తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కలబంద కాండం నుండి ఆకును కత్తిరించి.. సగానికి కట్ చేసి దాని జెల్‌ను చెంచాలోకి తీసుకోని మిక్సర్‌లో బ్లెండ్ చేయండి. తద్వారా మృదువైన జెల్ ఏర్పడుతుంది. ఈ జెల్‌ని తలపై దాదాపు 5 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. జుట్టుకు దాదాపు 10 నిమిషాల పాటు ఆవిరి పట్టి.. ఒక గంట వరకు జుట్టుకు జెల్‌ను అలాగే ఉంచుకొని అ తరువాత నీటితో జుట్టును కడిగేసుకోవాలి.

ఉసిరి:
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఉసిరి కాయలు చక్కని విరుగుడు., చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా, పొడవుగా, నిగారింపు సంతరించుకునేలా జుట్టుకు అవసరమైన పోషణ ఇచ్చే ఆమ్లా కుదుళ్లను గట్టిపరుస్తుంది. పరగడపున రోజూ ఉసిరికాయలు తినండి. అదేంటి ఏడాదిపొడవునా ఇవి దొరకవు కదా అనుకోకండి, ఎండబెట్టిన ఉసిరి ముక్కలు, లేదా ఉసిరి మురబ్బా వంటివి నిల్వచేసుకుని క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. లేదా ఉసిరికాయ ఊరగాయను తినాలి. సీ విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో జుట్టు ఆరోగ్యం మరింత పెరుగుతుంది.

రోజూ తలస్నానం వద్దు:
కొందరు తలస్నానం చేయకుండా బయటికి కాలు పెట్టరు. ఇంతకీ తలస్నానం ఎన్నిరోజులకు ఒకసారి చేయాలని చాలామంది అడిగే ప్రశ్నకు ఇదమిత్థంగా ఇది అని సమాధానం లేదు కానీ రోజూ తలస్నానం చేస్తే మీ జుట్టుకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ. అది కూడా నూనె రాయకుండా తలస్నానం అస్సలు చేయద్దు. ఇక షాంపుల్లోని రసాయనాల వల్ల కురులకు ప్రమాదం ఎక్కువ. అందుకే రోజూ షాంపుతో తలస్నానం చేయకండి.

నూనె: చాలామంది తలకు నూనె రాయటానికి ప్రాధాన్యత ఇవ్వరు. మీకు నచ్చిన ఏదో ఒక నూనెను పూయటం చాలా అవసరం. ఇలా చేస్తే బ్లడ్ సర్కులేషన్ పెరిగి, మీ జుట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు గోరువెచ్చని నూనె కూడా మసాజ్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇలా మసాజ్ చేశాక ఓ వెచ్చని టవల్ తో కొన్ని నిమిషాలపాటు తలకు అలాగే చుట్టుకోండి. దీంతో మీ జుట్టుకు ఎక్స్ ట్రా కండిషనింగ్ వస్తుంది.

బ్యాలెన్స్డ్ డైట్ : సమతుల్యమైన ఆహారం తీసుకోవటం ద్వారా కురుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పోషకాల లేమితో జుట్టు రాలటం ఎక్కువ అవ్వచ్చు. కంటి నిండా నిద్రపోవటం, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రొటీన్లున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఎక్కువ నూనె పదార్థాలు, కొవ్వు అధికంగా ఉన్న ఫ్యాటీ పుడ్స్ ను తగ్గించి, నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి.

ఉత్తమ ఫలితాల కోసం తీసుకునే రోజువారీ ఆహారంలో ఆకు కూరలను చేర్చుకోవాలి. అలాగే, ప్రతి రోజు ఒక గిన్నె తాజా పండ్లను తినండి. వేడి స్టైలింగ్ సాధనాలను ఉపయోగించకండి. రసాయనాలు లేని షాంపూలను ఉపయోగించండి. నూనె మర్ధన చేసుకోవటం, ఉసిరి తినటం, కలబందతో హెయిర్ ప్యాక్ (hair pack) వేసుకోవటం, ప్రతిరోజూ షాంపూ చేయటం, బ్యాలెన్స్డ్ డైట్ వంటివాటిపై ఒకసారి మీరు పూర్తిగా దృష్టిసారించండి. ఆతరువాత మీ జుట్టు ఒత్తుగా పెరిగినట్టు మార్పు కనిపిస్తే మంచిదేగా.

Updated On 14 Feb 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story