వాలు కనుల అందం అంతా ఇంతా కాదు. కేవలం కనురెప్పలు(eyelashes) పెద్దగా, పొడవుగా ఉన్నప్పుడు మాత్రమే.. ఆ అందం సొంతమవుతుంది. అందుకోసమే చాలా మంది ఐలాష్‌లు వాడుతుంటారు. అయితే వాటితో పని లేకుండా సహజసిద్ధంగా(Naturally) మీ కనురెప్పలు పెరగాలంటే? ఈ కెమికల్‌ ఫ్రీ చిట్కాలను ఫాలో అవ్వండి.

వాలు కనుల అందం అంతా ఇంతా కాదు. కేవలం కనురెప్పలు(eyelashes) పెద్దగా, పొడవుగా ఉన్నప్పుడు మాత్రమే.. ఆ అందం సొంతమవుతుంది. అందుకోసమే చాలా మంది ఐలాష్‌లు వాడుతుంటారు. అయితే వాటితో పని లేకుండా సహజసిద్ధంగా(Naturally) మీ కనురెప్పలు పెరగాలంటే? ఈ కెమికల్‌ ఫ్రీ చిట్కాలను ఫాలో అవ్వండి.
అందంలో కీ రోల్‌ పోషించే కనురెప్పల కోసం చాలా మంది ఆర్టీఫిషయల్‌ ఎక్స్‌టెన్షన్‌ కోసం పార్లర్స్‌లో వేలకు వేలు పెడుతున్నారు. అలాంటి వారంతా ఇక ఆ ప్రయత్నాలకు చెక్‌ పెట్టేసెయ్యండి. వీటిని పాటించి.. దట్టమైన కనురెప్పల్ని సొంతం చేసుకోండి.

ఎల్లప్పుడూ తేమగా..
సాధారణంగా మేకప్‌ ప్రొడెక్ట్స్‌ వాడటం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అందుకే కనురెప్పల్ని చాలా నీట్‌గా క్లీన్‌ చేసి పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కాటన్‌ సాయంతో మేకప్‌ క్లీనర్‌లో ముంచి.. నెమ్మదిగా మేకప్‌ని రిమూవ్‌ చే సుకోవాలి. కొన్నిసార్లు మేకప్‌ అవశేషాల దెబ్బుకు.. కళ్లకు ఐ ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తుంటాయి. దాంతో కనురెప్పల వెంట్రుకలు ఊడిపోతాయి. ప్రతి రోజు ముఖాన్ని కడిగినప్పుడు కనురెప్పల వెంట్రుకలు నీట్‌గా క్లీన్‌ చేసుకోవడం అలవాటు చేసుకోవండి.

రెప్పల్ని దువ్వతూ ఉండండి
మీరు చదివింది కరెక్టే. దువ్వండి అంటే.. దువ్వెనతో దువ్వమని కాదు. మస్కారా బ్రష్‌లు ఉంటాయి కదా.. వాటిని తీసుకుని.. ఆ బ్రష్‌ని శుభ్రంగా క్లీన్‌ చేసుకుని.. దానితో కనురెప్పల్ని దువ్వుతూ ఉండాలి. దాని వల్ల రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ఇక రెప్పలకు అంటిన దుమ్ము మురికి పూర్తిగా పోయి ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.

హెల్దీ ఫుడ్‌తో పాటు గ్యాప్‌ అవసరం
కనురెప్పలు బలంగా ఒత్తుగా పెరగాలంటే.. తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే. ఆకుకూరలు, చేపలు, అవకాడో వంటì పోషకారహారాలున్న ఫుడ్‌ని తీసుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా మేకప్‌ వేయడం వల్ల కూడా కనురెప్పలు పాడవుతాయి. ఐ లైనర్, మస్కారా వంటివి రోజు కాకుండా.. అత్యవసరమైనప్పుడు మాత్రమే వాడుతూ ఉండండి. వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే మేకప్‌ వేసుకుంటూ.. మిగిలిన రోజుల్లో కాస్త విరామం ఇచ్చి చూడండి.

సీరమ్‌..
సీరమ్‌ కనురెప్పల్ని పొడుగ్గా పెంచుతాయి. ఇందుకోసం యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలుంటాయి. దీని వల్ల కనురెప్పలు పొడవుగా పెరుగుతాయి.

కలబంద
కలబంద కూడా కనురెప్పల్ని పెంచడంలో చాలా సహకరిస్తుంది. కలబంద అప్లై చేయడం వల్ల కొల్లాజెన్‌ అంది.. మంచి మాయిశ్చరైజేష¯Œ అవుతుంది. అయితే దీనిని వల్ల హెయిర్‌ ఫోలికల్స్‌ హైడ్రేట్‌ అవుతాయి కాబట్టి వెంటనే బ్రష్‌ సాయంతో కొద్దిగా వాజిలేన్‌ రాయొచ్చు.

నూనెలు
కనురెప్పలు అందంగా పొడుగ్గా పెరిగేందుకు సహజ నూనెలు వాడొచ్చు. ఆముదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెల్ని వాడొచ్చు. వాటివల్ల మంచి మాయిశ్చరైజేషన్‌ అయ్యి.. కనురెప్పలు పెరిగేందుకు హెల్ప్‌ అవుతుంది. మస్కారా బ్రష్‌తో ఈ మూడింటిని కలిపి ఓ ఆయిల్‌లా చేసి అప్లై చేసుకోండి. అలా చేస్తే కనురెప్పలు హైడ్రేట్‌ అయి బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. ప్రయత్నించి చూడండి.

Updated On 17 April 2023 11:34 PM GMT
Ehatv

Ehatv

Next Story