ఈ తరంవారికి బింగన్నలు(Green Beetle) తెలిసే అవకాశం అంతగా లేదు. అందుకు కారణం నెమ్మదిగా అవి అంతరిస్తున్నాయి కాబట్టి! ఉత్తర తెలంగాణ ప్రజలు బంగారు పురుగా(Bangaru purugu) పిల్చుకునే బింగన్నలు దాదాపుగా కనుమరుగయ్యాయి. కొన్ని చోట్ల ఈ పురుగును రింగన్న(Ringanna) అని కూడా అంటారు. దక్షిణ తెలంగాణలో కొన్ని చోట్ల జీరంగి పురుగు అని పిలుచుకుంటారు. ఇరవై ముప్ఫయ్‌ ఏళ్ల కిందటి వరకు గ్రామాలలో ఈ పురుగులు విపరీతంగా కనిపించేవి.

ఈ తరంవారికి బింగన్నలు(Green Beetle) తెలిసే అవకాశం అంతగా లేదు. అందుకు కారణం నెమ్మదిగా అవి అంతరిస్తున్నాయి కాబట్టి! ఉత్తర తెలంగాణ ప్రజలు బంగారు పురుగా(Bangaru purugu) పిల్చుకునే బింగన్నలు దాదాపుగా కనుమరుగయ్యాయి. కొన్ని చోట్ల ఈ పురుగును రింగన్న(Ringanna) అని కూడా అంటారు. దక్షిణ తెలంగాణలో కొన్ని చోట్ల జీరంగి పురుగు అని పిలుచుకుంటారు. ఇరవై ముప్ఫయ్‌ ఏళ్ల కిందటి వరకు గ్రామాలలో ఈ పురుగులు విపరీతంగా కనిపించేవి. ఎక్కువగా మోదుగ, తాటి చెట్లపై ఉండేవి. పొలం గట్ల దగ్గర ఉండే ర్యాలపై కూడా బింగన్నలు వచ్చి వాలేవి. నిజంగానే ఇవి చాలా ఆకర్షణీయమైన పురుగులు. అందుకే కాబోలు వీటిని బంగారు పురుగులనేది! పిల్లలు బింగన్నలను ప్రాణప్రదంగా చూసుకునేవారు. బింగన్నలను అగ్గిపెట్టెల్లో, చిన్న చిన్న గురిగిలలో భద్రంగా దాచుకునేవారు. అవి తినడానికి తుమ్మ, ర్యాల ఆకులను వేసేవారు. రెండు రోజుల తర్వాత అవి తెల్ల రంగు గుడ్లు పెట్టేవి. అప్పుడు చూడాలి పిల్లల సంబరం. చిన్న బింగన్నలు బంగారు వర్ణంతో మెరిసేవి. అప్పట్లో మహిళలు తమ రైకలకు వీటి రెక్కలను డిజైన్‌గా అమర్చుకునేవారు. ఇప్పుడవి దాదాపుగా అంతరించిపోయాయి. పల్లెల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. అసలు మోదుగ చెట్లే(Moduga tree) నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. ఇక బింగన్నలు కనుమరుగవ్వడంలో ఆశ్చర్యమేముంది?

Updated On 26 Oct 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story