Night Dress : లుంగీలు, నైటీలు ధరించి బయటకు రాకండి..!
గ్రేటర్ నోయిడాలోని(Greater Noida) ఒక అపార్ట్‌మెంట్‌లోని నివాసితుల సంక్షేమ సంఘం సొసైటీ ఆవరణలో "లుంగీలు, నైటీలు ధరించి సంచరించవద్దని" కోరుతూ నివాసితులను కోరింది. “సొసైటీలో నడిచేటప్పుడు మీ ప్రవర్తన(behavior), దుస్తులపై(Dressing) అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆశిస్తున్నాం. తద్వారా మీ ప్రవర్తనపై ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. మీ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా మీ నుండి నేర్చుకుంటారు.
గ్రేటర్ నోయిడాలోని(Greater Noida) ఒక అపార్ట్‌మెంట్‌లోని నివాసితుల సంక్షేమ సంఘం సొసైటీ ఆవరణలో "లుంగీలు, నైటీలు ధరించి సంచరించవద్దని" కోరుతూ నివాసితులను కోరింది. “సొసైటీలో నడిచేటప్పుడు మీ ప్రవర్తన(behavior), దుస్తులపై(Dressing) అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆశిస్తున్నాం. తద్వారా మీ ప్రవర్తనపై ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. మీ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా మీ నుండి నేర్చుకుంటారు. కాబట్టి మీరందరూ ఇంటి దుస్తులైన లుంగీ, నైటీ (Night Dress)ధరించి తిరగవద్దని అభ్యర్థిస్తున్నాం" అని హింసాగర్ సొసైటీ సర్క్యులర్‌ను జారీచేసింది. సొసైటీ కార్యదర్శి హరి ప్రకాష్ సంతకం చేసిన ఈ నోటీసు వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే నోటీసును తొలగించాలని కోరారు. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని సొసైటీ అధ్యక్షుడు సీకే కల్రా స్పష్టం చేశారు.
“సొసైటీ క్యాంపస్‌లో ప్రజలు లుంగీలు ధరించి కూర్చుంటారని.. ఈ విషయమై కొంతమంది మహిళల నుండి మాకు ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఒక్కొక్కరితో మాట్లాడే బదులు దీనిపై సర్క్యులర్ జారీ చేయడం మంచిదని భావించాం. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే.. దుస్తుల కోడ్ వాడాలని ఎటువంటి ఆర్డర్ వేయడం లేదు. అలాంటి దుస్తులను నివారించగలిగితే, అది ఇతరులకు కూడా సముచితంగా ఉంటుందని మేము అడిగామని కల్రా అన్నారు. వారు కోరుకున్నది ధరించవచ్చు. దీనిపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇది మంచి చర్య అని నివాసితుల నుండి నాకు సందేశాలు వచ్చినప్పటికీ, ప్రజలు దానిని వేరే విధంగా తీసుకున్నారని కల్రా చెప్పారు.