Dimple people Astrology Qualities : సొట్టబుగ్గల సుందరిలో ఏ లక్షణాలుంటాయి..?
సొట్టబుగ్గ సుందరీ(Dimple Beauty) ఎక్కడున్నా ప్రత్యేకమే. ఎంత మందిలో ఉన్నా ఈ అమ్మయిలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారనడంలో అతిశయోక్తి లేదు. సొట్టబుగ్గల సుందరి చిరునవ్వు నవ్వగానే ఆ నున్నని బుగ్గల్లో పడే సొట్టలు... ఆ నవ్వుకు మరింత అందాన్ని తెస్తాయి. సొట్టబుగ్గలు ఉన్న వ్యక్తులు అందంగా కనిపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్లు నవ్వినప్పుడు కనిపించే సొట్ట బుగ్గలే వారి అందన్ని డబుల్ చేస్తుంటాయి.

ఈ సొట్టబుగ్గలు ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా.. ?
సొట్టబుగ్గలున్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే అదృష్టం అని అంటుంటారు. ఈ అమ్మాయిలతో వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందట. సొట్టబుగ్గలు ఉన్నవారు మంచి భార్యగానే కాకుండా.. అత్తమామల పట్ల చాలా ప్రేమగా, అప్యాయంగా ఉంటారట. తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమగా, వినయపూర్వకంగా ఉంటారట. ఈ లక్షణాలన్నీ తన భార్యలో ఉండాలని ఏ భర్తయినా కోరుకోవడం సహజం. జ్యోతిష్య శాస్త్రం(Astrology) ప్రకారం సొట్ట బుగ్గలు ఉన్నవారు అద్భుతమైన ప్రేమను కలిగి ఉంటారట. తన భాగస్వామిని చాలా ప్రేమిస్తారట. భర్తను, కాపురాన్ని ఎలా వెళ్లదీయాలో ఈ సుదరికి బాగా తెలుసట. భర్తను ఎలా సంతోషపెట్టాలో సొట్టబుగ్గల సుందరికి మరింత బాగా తెలుస్తుందట. ఈ అమ్మాయిలు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారట. చాలా ఓపెన్ గా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు తమ జీవితాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా హాయిగా గడుపుతారట. ఇతర విషయాల గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరని జ్యోతిష్యులు చెప్తున్నరు. వీరి ముఖంలో బాధ అనేది చాలా అరుదుగా కనిపిస్తుందని.. అయితే సొట్ట బుగ్గ ఉండడం ఓ రకంగా లోపమే కానీ.. బుగ్గ మీద సొట్ట అన్నది అందమైన లోపం. బుగ్గమీద చర్మం ఇంకా దాని కింద ఉండే కండ.. రెండూ సరి సమానంగా లేనప్పుడు ఈ సొట్ట ఏర్పడుతుందట. ఇదీ ఓ రకంగా అదృష్టమేనంటున్నారు...!