ఈ మధ్య చాలా మందికి హెల్త్‌(Health) కాన్షియస్‌ పెరిగింది. డైట్‌ను కూడా చక్కగా మెయింటైన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పచ్చి కూరగాయలను(Raw vegetables) తింటున్నారు. ఎవరు చెప్పారో తెలియదు ఇదో అలవాటుగా మారిపోయింది. కానీ కొన్ని పదార్ధాలను, కొన్ని కాయగూరలను ఇలా పచ్చిగా తింటే లేనిపోని జబ్బులు వస్తాయని డాక్టర్లు(Doctors) హెచ్చరిస్తున్నారు. బచ్చలికూర, గోంగూర, పాలకూరలో ఆక్సలేట్‌ అనే హానికర పదార్థం ఎక్కువగా ఉంటుందట!

ఈ మధ్య చాలా మందికి హెల్త్‌(Health) కాన్షియస్‌ పెరిగింది. డైట్‌ను కూడా చక్కగా మెయింటైన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పచ్చి కూరగాయలను(Raw vegetables) తింటున్నారు. ఎవరు చెప్పారో తెలియదు ఇదో అలవాటుగా మారిపోయింది. కానీ కొన్ని పదార్ధాలను, కొన్ని కాయగూరలను ఇలా పచ్చిగా తింటే లేనిపోని జబ్బులు వస్తాయని డాక్టర్లు(Doctors) హెచ్చరిస్తున్నారు. బచ్చలికూర, గోంగూర, పాలకూరలో ఆక్సలేట్‌ అనే హానికర పదార్థం ఎక్కువగా ఉంటుందట! ఇది మూత్రపిండాలలో(Kidneys) రాళ్లు ఏర్పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు శరీరం ఐరన్‌, క్యాల్షియం శోషించుకోకుండా అడ్డుపడుతుందని, అందుకే వీటిని ఉడికించి మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. మనం ఇష్టంగా తినే వంకాయలో(Bringal) పోలనిన్‌ అనే రసాయన సమ్మేళనం ఉంటుందని, దీన్ని పచ్చిగా తిన్నా, సగం ఉడికించి తిన్నా వికారం, వాంతులు అవ్వడమే కాకుండా మైకం కూడా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు పచ్చి కోడి గుడ్లను(Egg) తీసుకుంటాను. పాలలో కలిపి కొందరు తాగుతారు. అయితే ఇందులోని బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, తెల్లసొన, పచ్చసొన పూర్తిగా గట్టిపడేంతవరకూ గుడ్లని ఉడికించి తీసుకోవాలి. అలాగే పాలు(Milk) కూడా పచ్చివి తాగకూడదు. కాచిన తర్వాతే తాగాలి. క్యాబేజ్‌, క్యాలీఫ్లవర్‌, బ్రొకలీ వంటి వాటిలో పాథోజన్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని పచ్చిగా తీసుకున్నా లేదా సగం ఉడికించి తీసుకున్నా జీర్ణం కాదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు(Lactating women), ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని నిపుణులు మరీమరీ చెబుతున్నారు.

Updated On 20 Dec 2023 2:12 AM GMT
Ehatv

Ehatv

Next Story