Long Covid Problem : కరోనాతో మంచాన పడినవారికి లాంగ్ కోవిడ్ ప్రమాదం
కరోనా(Corona) సద్దుమణిగినప్పటికీ అది సృష్టించిన భయోత్పాతం ఇప్పటికీ జనం స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. ఇంకా భయపెడుతూనే ఉంది. తాజాగా ఓ పరిశోధన సారాంశం వింటే ఆందోళన కలగకమానదు.
కరోనా(Corona) సద్దుమణిగినప్పటికీ అది సృష్టించిన భయోత్పాతం ఇప్పటికీ జనం స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. ఇంకా భయపెడుతూనే ఉంది. తాజాగా ఓ పరిశోధన సారాంశం వింటే ఆందోళన కలగకమానదు. కరోనా రోగుల్లో వారం పాటు, ఆపై మంచానికి పరిమితమైన వారిలో లాంగ్ కోవిడ్(Long Covid) లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయట!కోవిడ్ బారిన పడి ఆపై కోలుకున్న వారిలో చాలా మంది విపరీతమైన ఒంటినొప్పులు, తదితర లక్షణాలతో బాధపడుతున్నారట!
లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్(Lancet Regional Health Europe Journal) అధ్యయనం ఈ భయంకరమైన వాస్తవం తెలిపింది.
పురుషులు, మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా, అన్ని వయసుల వారిలో ఇది సమానంగా కనిపించినట్టు అధ్యయనం తెలిపింది. కరోనాతో రెండు నెలలకు, అంతకుమించి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారిలో ఈ సమస్యలు, లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తేలింది. అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్‌లలో సుమారు 65 వేల మంది పెద్దవారిని ఎంచుకున్నారు. వీరంతా 2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు మధ్య వివిధ రకాల కోవిడ్ తరహా శారీరక సమస్యలను ఎదుర్కొన్నారు. వీరంతా కోవిడ్ టీకాలు వేయించుకున్నవారే! వీరిలో 22 వేల మందికి పైగా కరోనా కాలంలో ఆ వ్యాధితో బాధపడ్డారు.
65 వేల మందిలో పది శాతం మంది వారం రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు కరోనా కారణంగా మంచాన పడినవారే ఉన్నారు. ఇలా మంచాన పడ్డవారిలో చాలామంది ఇతరులతో పోలిస్తే 37 శాతం ఎక్కువ లాంగ్ కోవిడ్ లక్షణాలతో సతమతమయ్యారు. వీరికి శ్వాస ఆడకపోవడం(Breathing Problem), ఛాతీ నొప్పి(Chest Pain), తల తిప్పడం(Headache), విపరీతమైన తలనొప్పితో ఇప్పటికీ బాధపడుతున్నారు. మంచాన పడ్డ వారితో పోలిస్తే ఇతరుల్లోనూ ఇలాంటి లక్షణాలు తలెత్తినా వాటి తీవ్రత మాత్రం అంత ఎక్కువగా లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం కోవిడ్ సోకిన మూడు నెలల తర్వాత దాని తాలూకు లక్షణాలు తిగరబెట్టి కనీసం రెండు నెలలు, అంతకు మించి కొనసాగితే దాన్ని లాంగ్ కోవిడ్ అంటారు. కోవిడ్ బారిన పడిన వారిలో కనీసం పది నుంచి 20 శాతం మందిలో లాంగ్ కోవిడ్ తలెత్తినట్టు అధ్యయానాల్లో స్పష్టమయ్యింది.