చాలామంది చక్కగా ఎర్రగా.. తెల్లగా అందంగా ఉంటారు కాని.. వారిలో కొన్ని భాగాలు మాత్రం నలుపుతో ముఖ్యంగా ముదురు నలుపుతో ఉంటాయి. అవి మనలో కాన్ఫిడెట్ ను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మెడ చుట్టూ.. చంక(Under arms) భాగాల్లో నలుపు పోగొట్టాలి అంటే.. ఏం చేయాలి చూద్దాం.

చాలామంది చక్కగా ఎర్రగా.. తెల్లగా అందంగా ఉంటారు కాని.. వారిలో కొన్ని భాగాలు మాత్రం నలుపుతో ముఖ్యంగా ముదురు నలుపుతో ఉంటాయి. అవి మనలో కాన్ఫిడెట్ ను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మెడ చుట్టూ.. చంక(Under arms) భాగాల్లో నలుపు పోగొట్టాలి అంటే.. ఏం చేయాలి చూద్దాం.

మెడ(Neck) చుట్టు చర్మం ముదురు నలుపులోకి(Tan Black) మారి ఇబ్బంది పెడుతుంది. చాలా మందిలో ఇది కాన్ఫిడెంట్ ను దెబ్బతీస్తుంది. పెరుగు(Curd), నిమ్మకాయ(Lemon) ఇటువంటి వాటికి బాగా పనిచేస్తుంది. పెరుగులో నిమ్మకాయరసం కలిపి .. ప్యాక్ వేసుకుంటే.. మెడ చుట్టూ ఉన్న ముదురు రంగు ఇట్టే తొలగిపోతుంది. ఈరెండు పదార్ధాలలో ఉండే నేచురల్ ఎంజైమ్స్ నలుపుదనాన్ని పోగొట్టడానికి సహాయపడతాయి.

బోప్పాయిలో .. చర్మానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పండిన బొప్పాయిని నోటిద్వారా తీసుకున్నా.. పై పూతగా వాడినా.. చర్మానికి కాంతి వస్తుంది.. మంచి పోషణ ఇస్తుంది. అందుకే పండిన బొప్పాయి తీసుకుని పేస్ట్ గా చేయండి. దీనిలో పెరుగును వేసి బాగా కలిపి మెడ చుట్టూ అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేయండి. ఇది మెడపై ఉన్న నలుపు రంగును పోగొడుతుంది.

బంగాళాదుంపలో మన చర్మం ముదురు రంగును తొలగించడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. ఇవి నల్లటి మచ్చలను తొలగించి చర్మానికి నేచురల్ గ్లోని ఇస్తాయి. ఇందుకోసం చిన్న చిన్న బంగాళాదుంపలను తీసుకుని వాటి తొక్క తీసేసి జ్యూస్ తయారు చేయండి. ఇప్పుడు ఈ బంగాళాదుంప రసాన్ని మీ మెడకు అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

కలబంద గుజ్జులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఇది చర్మ నలుపుదనాన్ని కూడా పోగొడుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్ లో చెంచా పెరుగు వేసి బాగా కలిపి మెడ చుట్టూ అప్లై చేయండి. వారానికి రెండు, మూడు రోజులు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ఇవే కాదు రోజు విడిచి రోజు సున్నిపిండితో శరీరాన్ని గట్టిగా నలుగు పెట్టండి. చర్మం కాంతితో మెరిసిపోతుంది. ముక్యంగా మెడపై నలుపు పోవడం కోసం ఇది బాగా పనిచేస్తుంది. పాలమీగడ కూడా ఈనలపుకు బాగా పని చేస్తుంది

Updated On 15 May 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story