ఎక్కువ సూర్యరశ్మి వల్ల చర్మ కమిలిపోవడం(Tan) ఎర్రబడడం జరుగుతుంది. ఇది చర్మానికి ముదురు రంగును ఇస్తుంది. అయితే చర్మం మళ్లీ తాజాదన్నాన్ని సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు(tips) పాటించాలి. టాన్ తొలగించడానికి ప్రజలు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. చాలా మంది వ్యక్తులు తమ చర్మాన్ని బ్లీచ్ చేసుకుంటారు, ఇది అసురక్షిత అభ్యాసం అయినప్పటికీ.

ఎక్కువ సూర్యరశ్మి వల్ల చర్మ కమిలిపోవడం(Tan) ఎర్రబడడం జరుగుతుంది. ఇది చర్మానికి ముదురు రంగును ఇస్తుంది. అయితే చర్మం మళ్లీ తాజాదన్నాన్ని సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు(tips) పాటించాలి. టాన్ తొలగించడానికి ప్రజలు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. చాలా మంది వ్యక్తులు తమ చర్మాన్ని బ్లీచ్ చేసుకుంటారు, ఇది అసురక్షిత అభ్యాసం అయినప్పటికీ. అరోమాథెరపిస్ట్, కాస్మోటాలజిస్ట్, ఇనాటూర్ వ్యవస్థాపకురాలు పూజా నాగ్‌దేవ్ అన్నారు. ఇంట్లో తేలికగా దొరికే పదార్థాలను ఉపయోగించి మీరు టాన్‌ని తొలగించవచ్చు. ఇంట్లోనే సహజంగా, సులభంగా, సురక్షితంగా ట్యాన్‌ను తొలగించుకోవడానికి కొన్ని రెమెడీస్ ట్రై చేయవచ్చు.

టమోటా ప్యాక్‌(Tamato pack0: ఒక టమోటాను తరిగి దానికి ఒక స్పూను పాలు చేర్చి కలపాలి. దీన్లో ఒక టీస్పూను పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూను తేనె వేసి బాగా కలిపి పట్టించాలి. ఆరాక చల్లని నీటితో కడిగేసుకోవాలి.

నారింజ, తేనె ప్యాక్..

పసుపు పొడి, నారింజ తొక్క పొడి, తేనె బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసి చర్మంపై అప్లై చేయాలి. ఐదు నుంచి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. “నారింజలో హెస్పెరిడిన్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్‌ని తగ్గించే సమ్మేళనం. పసుపు పొడి యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఇది మీకు హెల్తీ అండ్ పర్ఫెక్ట్ స్కిన్ ఇస్తుంది.

అలోవెరా జెల్, దోసకాయ..
దోసకాయ పేస్ట్ చేసి అందులో తేనె, అలోవెరా కలిపి టాన్ టాన్ ఉన్న దగ్గర అప్లై చేయాలి. అలోవెరా జెల్, తేనె పిగ్మెంటేషన్‌ను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఉత్తమ ఫలితాల కోసం మిశ్రమాన్ని 20 నిమిషాల తర్వాత మాత్రమే కడగాలి.

ఓట్స్ పిండి: 3 స్పూన్స్ బట్టర్ మిల్క్ తీసుకొని దానిలో రెండు స్పూన్లు ఓట్స్ లో మిక్స్ చేసి బాగా కలిపి శరీరం పై టాన్ ఉన్నచోట అప్లై చేసుకోవాలి.

Updated On 10 May 2023 11:33 PM GMT
Ehatv

Ehatv

Next Story