గతంలో ఏమో తెలియదు కాని.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉండటం కామన్.

గతంలో ఏమో తెలియదు కాని.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉండటం కామన్. ఇంటి మీద లేకున్నా.. ఇంటి ముందు చిన్న సెటప్ చేసుకుని అయినా వాటర్ ట్యాంక్ ను మెయింటేన్ చేస్తున్నారు. అయితే ఆ ట్యాంక్ ను శుభ్రంగా ఉంచుకోకపోతే.. అది మీ కుటుంబ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటుంది.

వాటర్ ట్యాంక్ ఏదైనా సరే, ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటర్ ట్యాంక్ శుభ్రంగా లేకుంటే అందులో బ్యాక్టీరియా, ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆ నీటినివాడటం వల్లే ఆరోగ్యం పాడై.. ఎన్నో రోగాలు వస్తాయి.

వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు చాలామంది. అందుకే చాలామంది ఏళ్లకు ఏళ్లు కడగడం మానేస్తుంటారు. కానీ అలా చేయడం తప్పు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలి. కాబట్టి, మీరు ఇంట్లో మీ వాటర్ ట్యాంక్‌ను కడగడానికి కష్టపడుతున్నట్లయితే, దానిని సులభంగా ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ ఉంది.

మీరు ఇంటిలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి ముందు, మొదట దానిలోని మొత్తం నీటిని తీసివేయండి. తర్వాత అందులో బ్లీచింగ్ పౌడర్ వేసి సుమారు 2-3 గంటల పాటు నాననివ్వాలి. బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ నుండి బ్యాక్టీరియా మరియు ఆల్గేలను తొలగించడంలో సహాయపడుతుంది. అప్పుడు నీటితో పూర్తిగా ట్యాంక్ శుభ్రం చేయు.దుమ్ము మరియు కీటకాలు లోపలికి రాకుండా వాటర్ ట్యాంక్‌ను ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచండి.

అంతే కాకుండా నీరు శుభ్రంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉంటే.. వాటర్ ట్యాంక్ కు ఎక్కువ దుమ్ము కాని, మురికి కాని పట్టదు. అందుకే వాటర్ ట్యాంక్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అప్పడప్పుడు బ్లీచింగ్ వేయండి.. అందినంత మేర.. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ బ్రష్ లు కూడా దొరుకుతుంటాయి వాటిని ఉపయోగించి క్లీన్ చేయండి. లేదంటే పెద్ద కర్రలకు శుభ్రమైన క్లాత్ కట్టి కూడా క్లీన్ చేయవచ్చు.

Updated On 28 Dec 2024 1:30 PM GMT
ehatv

ehatv

Next Story