పొడి దగ్గు(Dry Cough) లేదా.. కోరింత దగ్గు అనేది వైరల్ ఇన్ఫెక్షన్(Viral infection). ఇది ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారికి కొంచెం పెద్దగా దగ్గు వస్తుంది. దగ్గుతున్నప్పుడు గొంతులో చికాకు ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పడుకున్న తర్వాత దగ్గు వస్తుంది. గొంతు మూసుకుపోయినట్లు ఫీలింగ్ కలుగుతుంది.
పొడి దగ్గు(Dry Cough) లేదా.. కోరింత దగ్గు అనేది వైరల్ ఇన్ఫెక్షన్(Viral infection). ఇది ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారికి కొంచెం పెద్దగా దగ్గు వస్తుంది. దగ్గుతున్నప్పుడు గొంతులో చికాకు ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పడుకున్న తర్వాత దగ్గు వస్తుంది. గొంతు మూసుకుపోయినట్లు ఫీలింగ్ కలుగుతుంది.
పొడి దగ్గుకు కారణమేంటి.
దుమ్ము(Dust) మరియు పొగ(smoke) పొడి దగ్గుకు ముఖ్యమైన కారణాలు. ఇది ధూమపానం చేసేవారినే కాకుండా ఆ పొగను పీల్చే చుట్టుపక్కల వారిపై కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాదు కలుషిత నీటి వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. పొడి దగ్గు పేరుకు తగ్గట్టుగానే కఫం లేకుండా మనపై దాడి చేస్తుంది. దీనికి మరో కారణం అలర్జీ(Allergy) .. కొంతమందికి పెంపుడు జంతువుల చర్మం వల్ల పొడి దగ్గు కూడా ఉండవచ్చు. బయట తినే పిచ్చి పిచ్చి ఆహారం వల్ల కూడా పొడిదగ్గు వస్తుంది.
నివారణ మార్గాలు.
సాధారణ జలుబు(cold), దగ్గు(cough) వంటి సమస్యలతో బాధపడేవారు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి జలుబుతో పోరాడే గుణాలను కలిగి ఉంటుంది. నిమ్మకాయల్లో(Lemon) విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక చెంచా తేనె మరియు కొద్దిగా రోజ్‌షిప్ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల పొడి దగ్గు మరియు దానికి కారణమయ్యే కఫం నుండి బయటపడవచ్చు.
పొడి దగ్గుకు అల్లం(zinger) మరియు తేనె(Honey) ః
అర ఇంచు సైజు అల్లం ముక్కను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ వాటర్ లో వేసి మరిగించాలి. దీన్ని వడగట్టి అందులో ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తాగితే పొడి దగ్గు తగ్గుతుంది.
పొడి దగ్గుకు ఎండు ద్రాక్ష:
ఎండు ద్రాక్ష పిల్లలకు ఇష్టమైన ఆహారం. నీరు తీసిన తర్వాత 50 గ్రాముల ఎండుద్రాక్షను గ్రైండ్ చేసి, దానికి 50 గ్రాముల బెల్లం వేసి చిక్కబడే వరకు మరిగించాలి. పొడి దగ్గును నయం చేయడానికి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తినండి. దీని రుచి కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు పొడి దగ్గు ఉంటే, ఈ ఔషధాన్ని విస్తారంగా ఇవ్వవచ్చు.
పొడి దగ్గుకు పుదీనా నివారణ
పొడి దగ్గుకు పుదీనా ఒక మంచి ఉపాయం. పొడి దగ్గు నుండి ఉపశమనానికి పుదీనా వాటర్ తాగడం, పుక్కిలించడం.. లేదా పుదినీ సూప్‌గా తాగడం. ఇలా ఏ రకంగా అయినా పుదీనా వాడితే.. పొడిదగ్గు మాయం అవుతుంది.