Ground water Depletion : నీటిని తోడుతున్నందున మారుతున్న భూమి స్వరూపం..!
20 సంవత్సరాల కంటే తక్కువ కాలంలో, మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా భూగర్భ జలాలను పంపింగ్ చేయడంతో భూమి అక్షం దాదాపు 31.5 అంగుళాలు (లేదా 80 సెంటీమీటర్లు) మారిందని ఓ అధ్యయనం వెల్లడించింది.

20 సంవత్సరాల కంటే తక్కువ కాలంలో, మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా భూగర్భ జలాలను పంపింగ్ చేయడంతో భూమి అక్షం దాదాపు 31.5 అంగుళాలు (లేదా 80 సెంటీమీటర్లు) మారిందని ఓ అధ్యయనం వెల్లడించింది. సహజ వనరులను మనం ఉపయోగించడం వల్ల గ్రహం ఎలా తిరుగుతుందో ఇది చూపిస్తుంది. సియోల్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన కి-వీన్ సియో నేతృత్వంలోని, జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించబడిన పరిశోధనలో, 1993 మరియు 2010 మధ్య, భారీ మొత్తంలో భూగర్భ జలాలు దాదాపు 2,150 గిగాటన్లు భూగర్భ నిల్వల నుండి తోడారు. ఎక్కువగా వ్యవసాయం, రోజువారీ ఉపయోగాల కోసం ఈ నీటిని తోడారు. తర్వాత, ఈ నీరు సాధారణంగా మహాసముద్రాలలోకి చేరుకుంటుంది, ఆ మార్పు ప్రపంచ సముద్ర మట్టాలను కొద్దిగా పెంచింది (సుమారు 0.24 అంగుళాలు).. భూమి సమతుల్యతను మార్చింది.
ఈ అధ్యయనం భూగర్భ జలాలను పంపింగ్ చేయడం గతంలో అనుకున్నదానికంటే చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాథమికంగా, భూమి నుండి నీటిని బయటకు తీయడం వంటి మన చర్యలు మన గ్రహాన్ని భౌతికంగా ఎలా మారుస్తాయో, పర్యావరణపరంగానే కాకుండా, అంతరిక్షంలో ఎలా కదులుతాయో కూడా అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఉత్తర అమెరికా, వాయువ్య భారతదేశం వంటి ప్రదేశాల నుండి పెద్ద మొత్తంలో భూగర్భ జలాలు బయటకు తోడారని అధ్యయనం పేర్కొంది. భూగర్భం నుండి నీటిని తొలగించినప్పుడు భూమి వంపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇలాగే భూగర్భ జలాలను వాడుకుంటూ ఉంటే, భూవాతావరణంపై తీవ్రమైన దీర్ఘకాలిక ప్రభావాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన నీటి వనరులను తెలివిగా వాడుకోవడం చాలా ముఖ్యమైందిగా సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, పర్యావరణ సంఘాలు, నిర్ణయాధికారులకు ఈ అధ్యయనం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. భూగర్భజల క్షీణతను మనం ఇకపై విస్మరించలేము. ఇది కేవలం స్థానిక సమస్య కాదని.. ఇది మొత్తం గ్రహాన్ని ప్రభావితం చేసే విషయంమని రిపోర్ట్ తెలిపింది. భూగర్భ జలాల ఉపయోగాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను నిల్వలను రక్షించడం ద్వారా, కాలక్రమేణా భూమి వంపు దిశను నెమ్మదింపజేయవచ్చు లేదా మార్చవచ్చు. కానీ దీనికి చాలా సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
