రాగిపాత్రలు ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతాయి . అందుకే పూర్వ కాలం లో మన వాళ్ళు ఎక్కువగా ఈ రాగిపాత్రలనే ఉపయోగించేవారు . నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడం తో మనం ఇవాళ వాటర్ ప్యూరిఫైయర్ల ను ఉపయోగిస్తున్నాం . రాత్రాంతా రాగి పాత్ర లో ఉన్న నీటికి రాగి నుంచి ఒక మంచి గుణం వస్తుంది. మన ఆరోగ్యానికి కావాల్సిన మినరల్స్‌లో రాగి ఒకటి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్, […]

రాగిపాత్రలు ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతాయి . అందుకే పూర్వ కాలం లో మన వాళ్ళు ఎక్కువగా ఈ రాగిపాత్రలనే ఉపయోగించేవారు . నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడం తో మనం ఇవాళ వాటర్ ప్యూరిఫైయర్ల ను ఉపయోగిస్తున్నాం . రాత్రాంతా రాగి పాత్ర లో ఉన్న నీటికి రాగి నుంచి ఒక మంచి గుణం వస్తుంది. మన ఆరోగ్యానికి కావాల్సిన మినరల్స్‌లో రాగి ఒకటి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తాయి. అయితే కనీసం ఎనిమిది గంటల పాటు రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు మరి కొంతమంది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని రాగి పాత్రలలో ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు . అయితే, రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని పదార్ధాలు తినడం, తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారు ..అందుకే వీటినే ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం :

రాగిపాత్రల వల్ల ఉపయోగాలు :

రెగ్యులర్ గా రాగి పాత్ర లోని నీటిని తాగడం వల్ల ... శరీరం లోని కొవ్వుని తొందరగా కరిగిస్తుంది . అంతేకాకుండా జీర్ణసమస్యలు దూరం అవుతాయి. రాగి పాత్ర లోని నీరు హానికరమైన బాక్టీరియా ని చంపేసి అల్సర్స్ నీ, ఇండైజెషన్ నీ, ఇంఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈరాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని రోజుకి రెండు మూడు గ్లాసులు తాగినా కూడా రాగి శరీరానికి అందుతుంది.

రాగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతే కాదు, రాగి బీపీ ని కంట్రోల్ లో ఉంచి చెడు కొలెస్ట్రాల్ నీ, ట్రైగ్లిసరైడ్స్ నీ తగ్గిస్తుంది. .., క్యాన్సర్ ముప్పు ని తగ్గిస్తుంది. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం శరీరం లోని ఫ్రీ రాడికల్స్. రాగి వాటితో పోరాడి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా క్యా న్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధ పడుతున్నవారందరిలో ఉండే ఒక కామన్ ప్రాపర్టీ వారి శరీరంలో కాపర్ తక్కువ ఉండడమే అని నిపుణుల అభిప్రాయం. అందువల్లే, రాగి పాత్ర లో నీరు థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. దీంతో పాటు ఆర్థ్రైటిస్ ని అదుపులో ఉంటుంది.

ముఖం మీద ముడతలు కనపడకూడదు అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. ఈ నీరు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వయసు కనిపించనివ్వకుండా చేస్తుంది. రెగ్యులర్‌గా తాగితే ఆ తేడా మనకే తెలుస్తుంది. రాగి మంచిది కాబట్టే ఇప్పుడు చాలా మంది కాపర్ బాటిల్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో పాటు చర్మానికి చాలా మంచిది. శరీరం లో మెలనిన్ ఉత్పత్తి అవ్వడంలో కాపర్ పాత్ర చాలా ఉంది. పైగా అది చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది.

రాగిపాత్రలు ఇలా ఉపయోగించకూడదు .....

రాగిపాత్రలు పులుపుకు సంబ౦ధి౦చిన ఆహార పదార్ధాలు నిల్వ చేయడం కానీ.. వీటికి ఉపయోగించడం కానీ చేయకూడదు . పెరుగు లేదా పెరుగుతో తయారు చేసిన ఏదైనా రాగి పాత్రలో తినకూడదు. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి .రాగి పాత్రలో నిమ్మకాయ లేదా నిమ్మకాయతో చేసిన ఏదైనా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. వాస్తవానికి, నిమ్మకాయలో యాసిడ్ ఉంటుంది. ఇది రాగితో కలిపి విషంలా మారుతుంది
ఎలాంటి ఊరగాయను రాగి పాత్రలో నిల్వ ఉంచడం లేదా ఊరగాయతో తినడం చేయకూడదు .

Updated On 28 Feb 2023 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story