Fly In Large Intestine : అతడి పెద్ద పేగులో ఉన్నది చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు
మనిషిలో పెద్ద పేగుదాకా(Large Intestine) ఏదైనా ఆహారం(Food) వెళితే అప్పటికే అది జీర్ణమయ్యిందని అనుకోవాలి. అయితే అమెరికాలో(America) ఒక వ్యక్తి పెద్ద పేగులో ఈగ(fly) ఒకటి జీర్ణం కాకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలో కాకుండా పేగు గోడలకు అంటుకుని ఉన్న ఈగను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. జీర్ణాశయం, చిన్న పేగును(Small Intestine) దాటి కూడా ఈ కీటకం(Insect) ఎలా జీర్ణమవ్వకుండా(Digest) ఉందో తెలియక డాక్టర్లు తెగ ఆలోచిస్తున్నారు. అమెరికాలోని మిస్సోరి(Missouri) రాష్ట్రంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం వచ్చిన 63 ఏళ్ల వ్యక్తికి మొదట కొలొనోస్కోపీ చేశారు వైద్యలు.
మనిషిలో పెద్ద పేగుదాకా(Large Intestine) ఏదైనా ఆహారం(Food) వెళితే అప్పటికే అది జీర్ణమయ్యిందని అనుకోవాలి. అయితే అమెరికాలో(America) ఒక వ్యక్తి పెద్ద పేగులో ఈగ(fly) ఒకటి జీర్ణం కాకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలో కాకుండా పేగు గోడలకు అంటుకుని ఉన్న ఈగను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. జీర్ణాశయం, చిన్న పేగును(Small Intestine) దాటి కూడా ఈ కీటకం(Insect) ఎలా జీర్ణమవ్వకుండా(Digest) ఉందో తెలియక డాక్టర్లు తెగ ఆలోచిస్తున్నారు. అమెరికాలోని మిస్సోరి(Missouri) రాష్ట్రంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం వచ్చిన 63 ఏళ్ల వ్యక్తికి మొదట కొలొనోస్కోపీ చేశారు వైద్యలు. అందులో పెద్ద పేగులో ఈగ ఉందని తెలిసింది. కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ తాను తీసుకోలేదని, రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా(Pizza), తోటకూర(asparagus) తిన్నానని, అసలు ఈగ ఎలా లోపలికెళ్లిందో తనకైతే తెలీదని ఆ పెద్దాయన అంటున్నారు. దీనిపై మిస్సోరీ యూనివర్సిటీలో గ్యాస్ట్రోఎంటెరాలజీ(Gastroenterology) హెడ్ మాథ్యూ బెక్‌టోల్డ్(Matthew Becktold) ఏమన్నారంటే ' తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్ మయాసిస్(Intestinal myosis) అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు(Fly Eggs) లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి సందర్భాలలో ఆ వ్యక్తికి విరేచనాలు, వాంతలు, కడుపు నొప్పి ఉంటాయని, ఈయనకు మాత్రం అలాంటివేవీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం.