1990లలో అధిక రక్తపోటు(BP) సమస్యను అరికట్టేందుకు ఫైజర్ సంస్థ పరిశోధనలు మొదలు పెట్టింది. బ్రిటన్‌లోని మెర్తిల్‌ ట్వీడ్‌ ఫిల్ అనే చిన్న పట్టణంలో వయాగ్రా(Viagra) పుట్టింది. స్థానికంగా ఉన్న ఓ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఇక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో వీరికి పూట గడవడం కూడా కష్టంగా మారింది. రక్త పోటును అరికట్టేందుకు ఫైజర్‌(Pfizer) సంస్థ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. ఈ కార్మికులపై ప్రయోగాలు చేయాలనుకుంది. కార్మికుల ఉపాధి, ఆహార కొరతను ఆసరాగా చేసుకొని, డబ్బు ఆశ చూపుతూ వారికి ఆశలు కల్పించింది. ఈ మందులు వాడితే మూడు పూటలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది.

1990లలో అధిక రక్తపోటు(BP) సమస్యను అరికట్టేందుకు ఫైజర్ సంస్థ పరిశోధనలు మొదలు పెట్టింది. బ్రిటన్‌లోని మెర్తిల్‌ ట్వీడ్‌ ఫిల్ అనే చిన్న పట్టణంలో వయాగ్రా(Viagra) పుట్టింది. స్థానికంగా ఉన్న ఓ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఇక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో వీరికి పూట గడవడం కూడా కష్టంగా మారింది. రక్త పోటును అరికట్టేందుకు ఫైజర్‌(Pfizer) సంస్థ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. ఈ కార్మికులపై ప్రయోగాలు చేయాలనుకుంది. కార్మికుల ఉపాధి, ఆహార కొరతను ఆసరాగా చేసుకొని, డబ్బు ఆశ చూపుతూ వారికి ఆశలు కల్పించింది. ఈ మందులు వాడితే మూడు పూటలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది. క్లినికల్‌ ట్రైల్స్‌లో(Clinical trials) భాగంగా బీపీ మాత్రలను ప్రయోగించేందుకు ఇక్కడి యువకులను ఎంచుకున్నారు. తాము తయారుచేసిన యూకే-92,480 పిల్‌ను రోజుకు మూడు సార్ల చొప్పున పదిరోజులు వేసుకోవాలని యువకులను ఆదేశించారు. వారికి కొంత మొత్తం నగదును కూడా ఇవ్వడంతో యువకులు అందుకు అంగీకరించారు.

ఈ పిల్(Pill) వాడుతుండగా వారికి బీపీ తగ్గడమేమో కానీ మరో దుష్ప్రభావం వచ్చింది. ఈ పిల్‌ వాడినవారిలో క్రమేణ అంగస్థంభనలు పెరుగుతున్నాయి. గతంలో కంటే అధికంగా అంగస్తంభనలు(Erection) ఎక్కువగా ఉంటున్నాయని వారు వైద్యులకు తెలిపారు. అంగం కూడా మరింతగా గట్టిపడుతుందని వివరించారు. దీంతో ఫైజర్ సంస్థ అధిక రక్తపోటుపై పరిశోధనలే కాకుండా.. అప్పటికే ప్రపంచంలో గుర్తించిన మరో సమస్య.. అంగస్థంభన.. దీనిపై కూడా పరిశోధించాలని పూనుకుంది. ఈ క్రమంలో 1994లో స్వాంజీలో అంగస్తంభన సమస్యలు ఉన్న రోగులకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించింది. అంగస్తంభన సమస్యతో బాధపడేవారిపై పరిశోధనల్లో మంచి ఫలితాలు సాధించారు. పరిశోధనల్లో(Experiments) పాల్గొన్న యువకులు ఆ మాత్రలను ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదట. ఇక తమకు ఫైజర్ సంస్థ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రపంచంలో ఇది చరిత్ర సృష్టిస్తుందని వారు ముందే ఊహించి.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ డ్రగ్‌ నపుంసకత్వానికి(Impotency) చెక్‌ పెడుతుందని విశ్వసించిన ఫైజర్‌.. సమాజంలో దీని ప్రభావం ఎలా ఉంటుందని.. ప్రజలు ఆమోదిస్తారా లేదా అనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వైద్య నిపుణులతో సంప్రదింపులు చేసింది. అన్ని విధాల ఆమోదం పొందిన తర్వాత.. దీనిని ఎలా మార్కెటింగ్‌(Marketing) చేయాలని ప్రణాళికలు చేపట్టింది. తమ మార్కెటింగ్‌ టీమ్‌ను సిద్ధం చేసి అంగస్తంభనకు ఇదే చెక్‌ పెడుతుందని.. వివాహ సంబంధాలు ఈ సమస్య వల్ల తెగిపోవనే సందేశంతో మార్కెట్‌లోకి దీనిని తీసుకువచ్చారు.

అంగస్తంభన సమస్యకు చెక్‌ పెట్టేందుకు వచ్చిన తొలి ట్యాబ్లెట్ వయాగ్రాకు 1998 మార్చి 27న ఎఫ్.డీ.ఏ(FDA). అనుమతి లభించింది. అనంతరం అమెరికా(America), బ్రిటన్‌లో వయాగ్రా మార్కెట్లలోకి వచ్చింది. మార్కెట్‌లో ఈ డ్రగ్‌ సునామీ సృష్టించిందనే చెప్పాలి. 2008 వరకు దాదాపు 200 కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో ఫార్మా చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న డ్రగ్‌గా రికార్డులకెక్కింది. అలా ప్రపంచ వ్యాప్తంగా(World wide) దీని వాడకం పెరిగిపోయింది. 'మెర్తిల్‌ ట్వీడ్‌ ఫిల్' పట్టణంలోని యువకులే ఈ వయాగ్రాకు మూల కారణమని.. వీరే లేకుంటే వయాగ్రా పుట్టేదో కాదో అని చెప్తున్నారు.

Updated On 29 Dec 2023 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story