Do smartwatches cause cancer? : స్మార్ట్ వాచ్ వాడితే... క్యాన్సర్ వస్తుందా?
ఒకప్పుడు వాచ్ లను టైమ్ చూడటానికిమాత్రమే వాడేవారు. కాని రాను రాను చేతి గడియారాల పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అందరకి తెలిసిందే.
ఒకప్పుడు వాచ్ లను టైమ్ చూడటానికిమాత్రమే వాడేవారు. కాని రాను రాను చేతి గడియారాల పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అందరకి తెలిసిందే. స్మార్ట్ వాచ్ ల పేరుతో ఎన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయో తెలిసిందే. గడియారాలు సమయం చెప్పడానికి మాత్రమే ఉండే కాలం నుంచి స్మార్ట్‌వాచ్‌లు ఫోన్ కాల్స్ నుండి సోషల్ మీడియా వరకు అన్నీ చేయగల పరిస్థితికి టెక్నాలజీ డెవలప్ అయ్యింది.
అయితే టెక్నాలజీ ఎంత పెరిగితే.. అంత రేడియేషన్, మితిమీరిన టెక్నాలజీ కూడా ఏదో ఒక రకంగా నష్టానికే దారి తీస్తుంది అంటుంటారు. అదే విధంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ల వల్ల కలిగే నష్టాల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అవి నిజంగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా..? తాజా అధ్యయనం ఏం చెపుతోంది.
స్మార్ట్‌వాచ్‌లు క్యాన్సర్‌కు కారణమవుతాయా..? ఈవిషయం మీకు తెలుసా? స్మార్ట్ వాచ్ వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే అధునాతన స్మార్ట్ వాచ్ లపై తాజా అధ్యయనం ఈ షాకింగ్ ఆవిష్కరణను వెల్లడించింది. స్మార్ట్‌వాచ్‌లలో ఉండే పాలీఫ్లోరోఅల్‌కైల్, పెర్ఫ్లోరోహెక్సనోయిక్ యాసిడ్‌లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని నివేదిక పేర్కొంది.
అయితే ఏంటి ఈ పాలీఫ్లోరోఅల్‌కైల్, పెర్ఫ్లోరోహెక్సనోయిక్ యాసిడ్ అంటే.. ఇది మన ఇంట్లో వాడుతుంటారు కదా నాన్-స్టిక్ వంటసామాను అందులో ఉంటుంది. అంతే కాదు ఆడవారు తమ బ్యూటీ కోసం ఉపమోగించే మేకప్ లలో కూడా పాలీఫ్లోరోఅల్కైల్ రసాయనం వాడుతారు. అవి శరీరంలో తేలికగా కరగవు. ఇది పునరుత్పత్తి సమస్యలు , క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
అయితే దీనివల్ల ఎటువంట ిక్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్, మూత్రపిండాలు , వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఇది పెంచుకతుంది. 22 బ్రాండ్ల వాచీలను పరీక్షించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారట పరిశోధకులు . ఎక్కువ టైమ్ చేతికి ఇలా స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే ఈ ప్రమాదం ఉంటుంది అంటున్నారు. సో అందుకే స్మార్ట్ వాచ్ లతో కాస్త జాగ్రత్తగా ఉండండి మరి.