ఈ రోజుల్లో జుట్టు రాలడం(Hair Fall) అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. కానీ ఇదే సమస్య చాలామందిని మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల కెమికల్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు.

ఈ రోజుల్లో జుట్టు రాలడం(Hair Fall) అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. కానీ ఇదే సమస్య చాలామందిని మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల కెమికల్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే పరిష్కారం కాదు.. మరింత జుట్టు రాలిపోతుంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు జుట్టు సంరక్షణ, స్టైలింగ్ ప్రక్రియలో కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇది జుట్టు రాలడాన్ని మరింత పెంచుతుంది. జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడు ఈ రెండు తప్పుల అస్సలు చేయకూడదు. అవెంటో తెలుసుకుందామా.

జుట్టు సంరక్షణలో 2 తప్పులు చేయవద్దు...
1. డెర్మటాలజిస్ట్(Dermatologist) ప్రకారం.. కొంతమంది తమ జుట్టును వారానికి ఒకసారి మాత్రమే శుభ్రం చేస్తారు. అంటే కేవలం వారంలో ఒకసారి మాత్రమే షాంపూతో తలస్నానం చేస్తారు. దీంతో జుట్టుకు మరింత నష్టం జరుగుతుంది. అది ఎలాగంటే.. స్కాల్ప్‌లోని మురికి(scalp Dirt) వల్ల జుట్టు రాలడం ఎక్కువగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా జుట్టును శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేయకూడదు. వేసవిలో వారానికి కనీసం మూడు సార్లు షాంపూతో జుట్టును కడగాలి.

2. హెయిర్ స్టైలిష్ గా ఉండాలని కెరోటిన్(Keratine) వాడితే జుట్టు రాలడం మరింత ఎక్కువ అవుతుందని హెయిర్ నిపుణులు అంటున్నారు. కెరోటిన్ చికిత్స తర్వాత కొంత సమయం వరకు జుట్టును స్టైలిష్, మెరిసేలా చేస్తుంది. కానీ దాని ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. దీని బదులుగా హెయిర్ సప్లిమెంట్లను ఉపయోగించవచ్చని నిపుణులు సూచించారు. ఇందుకోసం శరీరంలో ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి.

వేసవిలో ప్రత్యేక జుట్టు సంరక్షణ చిట్కాలను అనుసరించండి
వేసవిలో జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉండాలంటే నూనె రాసుకోవడం(Hair Oil),హెయిర్ మాస్క్‌లతో(Hair Mask) కాపాడుకోవడం మంచిది. వారానికి కనీసం రెండుసార్లు నూనె అప్లై చేసి షాంపుతో శుభ్రం చేయడం మంచిది. దీనితో పాటు, నిమ్మకాయ, కలబంద లేదా పెరుగు వంటి పదార్థాలతో చేసిన హెయిర్ మాస్క్‌ను కూడా అప్లై చేయడం మంచిది.

Updated On 18 Jun 2023 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story