వర్షాకాలం అంటేనే రోగాలుగుర్తుకువస్తాయి.. వానలుపడుతుంటే.. సహజంగానే వివిధ రకాల వ్యాధుల భయం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా ఇమ్య్యూనిటీ సమస్య వస్తుంటుంది. సీజన్ మారడం.. వర్షాలు పడటం.. వాతావరణ సమస్య వల్ల ఎక్కువగా ఇన్ ఫెక్షన్లు సోకడం.. వ్యాధుల బారిన పడటం జరుగుతుంటుంది. దాని వల్ల రకరకాల వ్యాధుల సమస్య ఉత్పన్నమౌతుంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తీవ్రమౌతుంటాయి. ఈ సమస్యల్నించి రక్షించుకోవాలంటే ముందుగా ఇమ్యూనిటీ పటిష్టపర్చుకోవాలి.

వర్షకాలు(monsoon Season) ఎక్కువగా రోగాలబారిన పడుతుంటారు జనాలు. ఏంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతుంది. అటువంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం వంటింట్లో వాడే మసాలా దినుసుల(Spices) వల్ల.. ఆరోగ్యం పొందవచ్చు.. వర్షాకాలం వాడాల్సి దినసులేంటి..?

వర్షాకాలం అంటేనే రోగాలుగుర్తుకువస్తాయి.. వానలుపడుతుంటే.. సహజంగానే వివిధ రకాల వ్యాధుల భయం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా ఇమ్య్యూనిటీ సమస్య వస్తుంటుంది. సీజన్ మారడం.. వర్షాలు పడటం.. వాతావరణ సమస్య వల్ల ఎక్కువగా ఇన్ ఫెక్షన్లు సోకడం.. వ్యాధుల బారిన పడటం జరుగుతుంటుంది. దాని వల్ల రకరకాల వ్యాధుల సమస్య ఉత్పన్నమౌతుంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తీవ్రమౌతుంటాయి. ఈ సమస్యల్నించి రక్షించుకోవాలంటే ముందుగా ఇమ్యూనిటీ పటిష్టపర్చుకోవాలి.

ప్రతీ మనిషిలో ఇమ్యూనిటీ (Immunity)బలంగా ఉంటే.. ఏ విధమైన అనారోగ్య సమస్యలు రావు.. వచ్యినా ఎక్కువ కాలం నిలబడవు.. శరీరంలో నిరోధక శక్తి పెరగాలంటే..మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా పదార్ధాలను డైట్‌లో చేర్చడం వల్ల కూడా ఆ శక్తిని పెంచుకోవచ్చు. ఇంతకీ ఇమ్యూనిటీని పెంచేందుకు ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు నల్లమిరియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిలో ఇమ్యూనిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నల్లమిరియాలు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెటబోలిజం వృద్ధి చెంది..దగ్గు లేదా ఇతర గొంతులో గరగర సమస్య ఉంటే తీరిపోతాయి. మనిషి ఆరోగ్యంలో నల్లమిరియాలు బాగా ఉపయోగపడతాయి. అటు ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. రోజు వర్షాకాలంలో ఒక్కసారి అయినా.. నల్ల మిరియాలు పొడి చేసుకుని టీలోనో.. పాలలోనో తాగడం మంచిది.

పసుపు సర్వరోగ నివారిని. సహజసిద్ద యాంటీబయోటిక్ మెడిసిన్ పసుపు. మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్ధం పసుపు. ప్రతి ఇంట్లో పసుపు ఉంటే చాలు..ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండేదే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. శరీరాన్ని రకరకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. రోజూ రాత్రి వేళ పాలల్లో కాస్త మంచి పసుపు వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇమ్యూనిటీని పెంచే మరో మసాలాదినుసు లవంగం. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పటిష్టం చేస్తాయి. వర్షకాలంలో రోజూ లవంగం వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవడం అలవాటు చేసుకుంటే గొంతులో గరగర వంటి సమస్య ఉండదు. ఇమ్యూనిటీ కూడా పటిష్టమౌతుంది. వంటల్లో ఓ లవంగా వేయండి.. ప్లేవర్ బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రోజు బయటకు వెళ్లే ముందు ఓ లవంగా బుగ్గన పెట్టుకుంటే మరీ మంచింది.

Updated On 31 July 2023 4:56 AM GMT
Ehatv

Ehatv

Next Story