నీటి కాలుష్యం(Water Pollution) తెలుసు.వాయు కాలుష్యం(Air Pollution) గురించి విన్నాం.. శబ్ద కాలుష్యమూ విన్నాం. ఈ కాలుష్యాలతోనే ఆయుష్షును తగ్గించుకుంటున్నాం. లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వీటికి తోడు కాంతి కాలుష్యం(Light pollution) ఒకటి చేరింది. అంటే లైట్‌ పొల్యూషన్‌ అన్నమాట! దీంతో తలెత్తే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయట! అదేంటి కాంతి ఎక్కడైనా పొల్యూట్‌ అవుతుందా అన్న అనుమానం అక్కర్లేదు. కాంతి కాలుష్యంపై తాజాగా చైనా(China) పరిశోధనలు చేసింది. ఒకరిద్దరిపై కాదు, కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసింది. ఆ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ(Diabetes) బాధితులుగా మారారట! వీరంతా నగరవాసులు కావడం గమనార్హం.

నీటి కాలుష్యం(Water Pollution) తెలుసు.వాయు కాలుష్యం(Air Pollution) గురించి విన్నాం.. శబ్ద కాలుష్యమూ విన్నాం. ఈ కాలుష్యాలతోనే ఆయుష్షును తగ్గించుకుంటున్నాం. లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వీటికి తోడు కాంతి కాలుష్యం(Light pollution) ఒకటి చేరింది. అంటే లైట్‌ పొల్యూషన్‌ అన్నమాట! దీంతో తలెత్తే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయట! అదేంటి కాంతి ఎక్కడైనా పొల్యూట్‌ అవుతుందా అన్న అనుమానం అక్కర్లేదు. కాంతి కాలుష్యంపై తాజాగా చైనా(China) పరిశోధనలు చేసింది. ఒకరిద్దరిపై కాదు, కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసింది. ఆ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ(Diabetes) బాధితులుగా మారారట! వీరంతా నగరవాసులు కావడం గమనార్హం. కాంతి కాలుష్యం అధిక కాంతి వల్ల ఏర్పడుతుంది. అంటే మనం పండగలు పబ్బాలప్పుడు రంగు రంగుల విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేసుకుంటాం కదా! అవి మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతుంటాయి కదా! ఇదిగో ఇలాంటి లైట్ల వల్లే కాంతి కాలుష్యమవుతున్నదని సైంటిస్టులు చెబుతున్నారు. అన్ని రకాల అర్టిఫిషియల్‌ కాంతులు, మొబైల్‌ ఫోన్‌ నుంచి వచ్చే లైట్‌, ల్యాప్‌టాప్‌ లైటు, ఎల్ఈడీ(LED), కారు హెడ్‌లైటు(Head lights), హోర్డింగ్‌ల(Hoardings) నుంచి వచ్చే లైటు.. ఇవన్నీ కాంతిని పొల్యూట్‌ చేస్తాయి. ఈ కాంతి కాలుష్యం మన శరీరాలను ప్రభావితం చేస్తోందని అధ్యయనంలో తేలింది. మధుమేహ బాధితులుగా మార్చేస్తున్నదని రుజువయ్యింది. వీధి దీపాలు, స్మార్ట్‌ ఫోన్‌లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పాతిక శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మనిషి లైఫ్‌ స్టయిల్‌ను మారుస్తాయిని, శరీర చక్రాన్ని గతి తప్పేలా చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలు­ష్యం బారిన పడుతున్నారని సైంటిస్టులు అంటున్నారు. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. శరీరంలో మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్‌ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

Updated On 29 Sep 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story