World Puppetry Day 2024 : ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం
ఇప్పుడంటే వినోదానికి కొదవలేదు. అది కూడా ఇంటిపట్టునే ఉంటూ! లెక్కలేనన్ని ఓటీటీ(OTT)లు వచ్చేశాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు సరేసరి! ఆ మాటకొస్తే ఈ మధ్య న్యూస్ ఛానెళ్ల(News Channels)లోనే బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటోంది. వీటికి తోడు యూ ట్యూబ్(Youtube) వంటి సోషల్ మీడియాలు! ఓ మూడు దశాబ్దాల కింద సామాన్యులకు వినోద సాధనం అంటే సినిమానే! అంతకు ముందు నాటకాలు ఉండేవి.
ఇప్పుడంటే వినోదానికి కొదవలేదు. అది కూడా ఇంటిపట్టునే ఉంటూ! లెక్కలేనన్ని ఓటీటీ(OTT)లు వచ్చేశాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు సరేసరి! ఆ మాటకొస్తే ఈ మధ్య న్యూస్ ఛానెళ్ల(News Channels)లోనే బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటోంది. వీటికి తోడు యూ ట్యూబ్(Youtube) వంటి సోషల్ మీడియాలు! ఓ మూడు దశాబ్దాల కింద సామాన్యులకు వినోద సాధనం అంటే సినిమానే! అంతకు ముందు నాటకాలు ఉండేవి. తోలుబొమ్మలాటలు ఉండేవి. రంగస్థల నాటకాల విషయం ఇప్పటి తరంలో కొందరికి తెలిసే ఉంటుంది కానీ తోలుబొమ్మలు అనే మాట కూడా చాలా మందికి తెలియదు. పాతతరం వారికి వినోదం అందించిన తోలుబొమ్మలాట ఇప్పుడు ఒక అంతరించిపోతున్న కళ. ఆ కళను కాపాడుతున్నవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. 'భరతాది కథల జీరమఱుగల, నారంగ బొమ్మలనాడించు వారు, కడు అద్భుతంబుగ కంబసూత్రంబు లారగ బొమ్మలాడించువారు' అనే పద్యం 12వ శతాబ్దానికి చెందిన పాల్కూరి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే ఆలయాలలో లభ్యమయిన ఆనాటి శాసనాలను బట్టి కూడా చూసినప్పుడు బొమ్మలాటలు అంతకు ముందునుంటే ఉన్నాయనే విషయం రుజువు అవుతుంది. వేమన యోగిగా(Yogi Vemana) మారడానికి కూడా తోలుబొమ్మలాట(Puppetry) కారణమని చెబుతుంటారు. నాచనసోముడు(Nachana Somana) రచనల్లో కూడా బొమ్మలాట గురించి ప్రస్తావించాడు. తెలుగువారి ఆటను మరాఠీ వారు తేర్పుగా ఆడించి తమ వశం చేసుకున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అయినా నేటికీ తెలుగు జానపద కళారూపాలలో ఒకటిగా బొమ్మలాటలు కొనసాగుతున్నాయి. ఈ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2000 సంవత్సరం నుంచి మార్చి 21వ తేదీని వరల్డ్ పప్పెట్రీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అనేక ప్రాంతాలలో వివిధ రకాల తోలుబొమ్మలాట ప్రదర్శనలు జరుగుతాయి. ఈ కళ అంతరించిపోకూడదు! ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలి.