డబుల్ చిన్(double  Chin).. ఇప్పుడు ప్రతి ఒక్కరిని తెగ ఇబ్బంది పెడుతుంది. ఒక వ్యక్తి బరువు పెరగినప్పుడు వాళ్ల శరీరంలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తుంటాయి. అంతే కాకుండా బరువు పెరిగే సమయంలో కనిపించే ముఖ్య లక్షణం.. గడ్డం కింద కొవ్వు పెరగడం. దీనినే డబుల్ చిన్ సమస్య అని కూడా అంటారు. ఇది స్త్రీలు(Women), పురుషులు(Men) ఇద్దరిలో సాధారణమైనప్పటికీ తగ్గించుకోవడం చాలా కష్టం.

డబుల్ చిన్(double Chin).. ఇప్పుడు ప్రతి ఒక్కరిని తెగ ఇబ్బంది పెడుతుంది. ఒక వ్యక్తి బరువు పెరగినప్పుడు వాళ్ల శరీరంలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తుంటాయి. అంతే కాకుండా బరువు పెరిగే సమయంలో కనిపించే ముఖ్య లక్షణం.. గడ్డం కింద కొవ్వు పెరగడం. దీనినే డబుల్ చిన్ సమస్య అని కూడా అంటారు. ఇది స్త్రీలు(Women), పురుషులు(Men) ఇద్దరిలో సాధారణమైనప్పటికీ తగ్గించుకోవడం చాలా కష్టం. గడ్డం కింద ఉన్న కొవ్వు తగ్గాలంటే చాలా ప్రయత్నాలు చేస్తారు. కొందరు వ్యక్తులు డబుల్ గడ్డం తగ్గించడానికి కొన్ని వ్యాయామాలు చేయమని సూచిస్తారు. కానీ దాని కంటే సులభంగా, ఆయుర్వేద నిపుణులు గడ్డం కింద కొవ్వును తగ్గించడానికి కొన్ని సహజ పద్దతులను తెలిపారు.

ప్రతిరోజూ వ్యాయామం(exercise) చేయడం ఆపకూడదు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం(Healthy food) తీసుకోవడం అలవాటు చేసుకోండి. డబుల్ చిన్ తగ్గడానికి సమయం పడుతుంది. దీనికి చాలా ఓపిక అవసరం. ఆ అదనపు కొవ్వును తగ్గించడానికి సరైన ఆహారం, వ్యాయామం పని చేయకపోతే వైద్యుడిని సంప్రదించండి.

అలాగే ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) చేయడం. అంటే నోటిలో నూనె ఉమ్మివేయడం. ఇది మీ దవడలోని కండరాలను పని చేస్తుంది. ఇది గడ్డం కింద కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయిల్ పుల్లింగ్ ఉపయోగించి గడ్డం కొవ్వును తగ్గించుకోవడానికి ఈ పద్దతులను అనుసరించండి.

1. టీస్పూన్ నువ్వుల నూనెను(Sesame oil) నోటిలో వేసి, 10 నుండి 12 నిమిషాలు ఉంచి, ఆపై ఉమ్మివేయండి. ప్రతి ఉదయం బ్రష్ చేయడానికి ముందు కనీసం ఒక్కసారైనా ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల గడ్డం కింద కొవ్వు వేగంగా తగ్గుతుంది.

2. అభ్యంగం అనే ఆయుర్వేద మసాజ్ దవడలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. డబుల్ గడ్డం వదిలించుకోవడానికి ఈ చర్యల కలయిక మంచిది. ఆహారంలో ఆలివ్ నూనెను తీసుకోవడం వలన కొన్ని అదనపు పౌండ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఈ నూనెను తీసుకుని సున్నితంగా వేడి చేసి దవడ, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే వదిలి లేదా ఒక గంట లేదా రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Updated On 19 Jun 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story