కర్పూరం(Camphor) అంటే వెంటనే గుర్తుకు వచ్చేది దేవుడికి పూజ చేస్తే వెలిగిస్తాం.. హారితి కళ్ళకు అద్దుకుంటాం.. ఇవే కదా.. కాని కర్పూరం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా..? కర్పూరం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా తకకువ మందికి తెలుసు. కర్పూరం యాంటీ బాక్టీరియల్(Anti bacterial), క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది.

కర్పూరం(Camphor) అంటే వెంటనే గుర్తుకు వచ్చేది దేవుడికి పూజ చేస్తే వెలిగిస్తాం.. హారితి కళ్ళకు అద్దుకుంటాం.. ఇవే కదా.. కాని కర్పూరం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా..? కర్పూరం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా తకకువ మందికి తెలుసు. కర్పూరం యాంటీ బాక్టీరియల్(Anti bacterial), క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

కర్పూరాన్ని పేస్ట్ చేయడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. మీరు నొప్పి, మంట, దురద నుంచి ఉపశమనానికి దీనిని వాడవచ్చు. అంతే కాకుండా కర్పూరం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు శరీరంపై దురద(rashes) సమస్యలు ఉంటే కర్పూరాన్ని బాగా ఉపయోగపడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal infections) కారణంగా దురద ఏర్పడుతుంది. ఈ సందర్భంలో కర్పూరం పేస్ట్ చర్మ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దురదసమస్యకు కర్పూరాన్ని గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. దీనిని పుదీన నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు దురద ఉన్నచోట రాయాలి.

అంతే కాదు మడమలు పగుళ్లు(Cracked heels) బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. ఈ పరిస్థితిలో చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం. అప్పుడు కర్పూరం కూడా ఉపయోగించవచ్చు. దీనిని వాడితే వెంటనే పగుళ్లు నయమవుతాయి. దీనితో పాటు కాలిన గాయాలకి కర్పూరం పేస్ట్ అప్లై చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఇది వాటిని నయం చేస్తుంది. దీని కోసం కర్పూరాన్ని మెత్తగా రుబ్బి అందులో తేనె కలపాలి. దీన్ని గాయంపై పూయాలి. మొదట ఇది మీ చికాకును తగ్గిస్తుంది తర్వాత నెమ్మదిగా గాయాన్ని నయం చేస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత వల్ల లేదా జిడ్డు చర్మం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితుల్లో మొటిమలు వేగంగా పెరుగుతాయి. అలాంటి సమయంలో కర్పూరం బాగా పనిచేస్తుంది. కర్పూరం,నిమ్మకాయ పేస్ట్‌తో మొటిమలు తొలగించవచ్చు. నిమ్మకాయ ముఖం లోపలి భాగాన్ని క్లీన్ చేస్తుంది. జిడ్డు సమస్యని తొలగిస్తుంది.

Updated On 17 Aug 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story