పెద్దలు శతమానంభవతి అని దీవిస్తారు. అంటే వందేళ్లపాటు హాయిగా జీవించాలని ఆకాంక్షించడం అన్నమాట! ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షువును వద్దనే వారుంటారా? వంద శరత్తులను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చిరంజీవిగా, నిత్యయవ్వనులుగా ఉండేందుకు మనమేమీ అమృతం తాగలేదు కదా! అలాంటి అమృతంలాంటి ఔషధం కోసం శాస్త్రవేత్తలు(Scientists) పరిశోధనలు చేస్తున్నారు. మనిషి జీవితకాలం(Life Span) పొడిగించడానికి ప్రయత్నిస్తున్నారు.

పెద్దలు శతమానంభవతి అని దీవిస్తారు. అంటే వందేళ్లపాటు హాయిగా జీవించాలని ఆకాంక్షించడం అన్నమాట! ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షువును వద్దనే వారుంటారా? వంద శరత్తులను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చిరంజీవిగా, నిత్యయవ్వనులుగా ఉండేందుకు మనమేమీ అమృతం తాగలేదు కదా! అలాంటి అమృతంలాంటి ఔషధం కోసం శాస్త్రవేత్తలు(Scientists) పరిశోధనలు చేస్తున్నారు. మనిషి జీవితకాలం(Life Span) పొడిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వారి ప్రయత్నాలు ఫలించలేదు కానీ ఇప్పుడు వారు చేస్తున్న నూతన పరిశోధనలు దీర్ఘాయువుకు భరోగా ఇచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్(Anti Aging Drug) కోసం తీవ్ర పరిశోధన చేస్తున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించగలిగితే దీర్ఘాయువును సాధించినట్టేనన్నది సైంటిస్టుల భావన. లేటెస్ట్‌గా బక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఏజింగ్‌(Buck Institute for Research on Aging) అనే సంస్థకు చెందిన సైంటిస్టులు కెనోరబ్డిటిస్‌ ఎలాగాన్స్‌(Caenorhabditis elegans) అనే నెమటోడ్‌లను ఎలుకలలోకి ప్రవేశపెట్టారు. అంటే నీటిలో నివసించే ఓ రకమైన బ్యాక్టిరియాను(Bacteria) ఎలుకలోకి ప్రవేశపెట్టారు. తద్వారా వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో సక్సెసయ్యారు. మనిషికి దీర్ఘాయువును అందించడంలో ఓ మెట్టు పైకి ఎక్కారనే అనుకోవాలి. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్‌లలో మైక్రోఫాగీలు పుష్కలంగా ఉంటాయి. మైక్రోఫాగీ(Microphagy) అనేది ఓ రకమైన తెల్ల రక్త కణం(White Blood Cell). మన రోగనిరోధకశక్తిలో తెల్లరక్త కణం కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. మృత కణాలను తొలగించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంటుంది.కెనోరబ్డిటిస్‌ ఎలిగాన్స్‌ నెమటోడ్‌లు అందించే ప్రయోజనాలు కొమారిన్‌లో కూడా ఉన్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. ముఖ్యంగా ఇవి మొక్కలలో , మరీ ముఖ్యంగా దాల్చినచెక్కలో ఎక్కువగా ఉంటాయి కొమారిన్‌ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ‍ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంటే వయసు పెరగడం మందగిస్తుంది. తద్వారా ఆయుఃప్రమాణం పెరుగుతుంది.

Updated On 20 Nov 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story