స్పా అంటే బయటికి వెళ్లి.. డబ్బు ఇచ్చి చేయించుకోవాల్సిందే అనుకుంటారు చాలామంది. కానీ ఇంట్లోనే ప్రశాంతమైన ఫీలింగ్ కలిగించే స్పా ఎలా చేసుకోవాలి? పైగా వేసవిలో బాడీకి రీఫ్రెష్‌మెంట్ అందించే స్పా.. ఖర్చుతో కూడుకున్న పని బయటైతే. కానీ ఇంట్లోనే ఆ ప్రెష్ ఫీలింగ్ రావాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

స్పా(spa) అంటే బయటికి వెళ్లి.. డబ్బు ఇచ్చి చేయించుకోవాల్సిందే అనుకుంటారు చాలామంది. కానీ ఇంట్లోనే ప్రశాంతమైన ఫీలింగ్ కలిగించే స్పా ఎలా చేసుకోవాలి? పైగా వేసవిలో(summer) బాడీకి రీఫ్రెష్‌మెంట్ అందించే స్పా.. ఖర్చుతో కూడుకున్న పని బయటైతే. కానీ ఇంట్లోనే ఆ ప్రెష్ ఫీలింగ్ రావాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందు టైమ్ ఫిక్స్ అవ్వండి
స్పా అంటే కనీసం 20 నిమిషాలు పైనే.. సమయం పడుతుంది. పైగా ఇంట్లో అంటే నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. వంట పని, ఇంటి పని అంటూ ఏదో పనితో బిజీగా ఉండే మీరు.. సరిగ్గా అరగంట సమయాన్ని ముందే ఫిక్స్ చేసుకుని.. ఆ సమయానికి ఎన్ని పనులు ఉన్నా స్పా చేసుకోవాల్సిందే అని ఫిక్స్ అవ్వాలి. లేదంటే మిగిలిన అన్ని టిప్స్ వేస్ట్ అన్నమాట.

చోటు కూడా ముఖ్యమే
ఇంట్లో స్పాని ఎక్కడ పడితే అక్కడ చేసుకోలేం. అందుకే ముందుగా ఎక్కడ చేసుకోవాలో ముందే ప్లేస్‌ని ఫిక్స్ అయిపోయింది. అది ఎవరు డిస్టర్బ్ చేయని చోటు అయ్యి ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండే ప్లేస్‌ని ఎంచుకోవాలి. కాస్త డార్క్ రూమ్‌లాంటిదైతే మరీ మంచిది.

కొవ్వత్తులు(candles)
మంచి సువాసన వచ్చే కొవ్వత్తుల్ని(scented candles) ఎంచుకుని.. వాటిని ముందే వెలిగించి పెట్టుకోవాలి. లేదంటే మనసుని ప్రశాంతంగా ఉంచే వాసనల కోసం.. డిఫ్యూజర్స్‌ని(Diffuser) కూడా వాడొచ్చు.

ఆరోగ్యకరమైన చల్లటి పానీయాలు(Healthy Cool Drinks)
కాస్త క్లాస్‌గా ఉండేలా.. చల్లటి పానీయాలను సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఉదాహరణకు.. కొన్ని దోసకాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కొద్దిగా పుదీనా ఆకులు, ఐస్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు ఒక గ్లాసులో పోసుకుని.. పెట్టుకోవాలి. వీటిని మధ్య మధ్యలో తాగుతూ రీఫ్రెష్ ఫీల్ అవ్వచ్చు.

వాటిని వదిలేయండి
సాధారణంగా స్పా చేయించుకునేది.. చేసుకునేదే ప్రశాంతత కోసం. అందుకే ముందు ఆ అరగంట మీరు ఫోన్స్‌కి(Phones) టీవీలకి(TV) దూరంగా ఉండాలి. అవసరం అయితే ఆ కాసేపు ఫోన్‌లో నెట్ ఆఫ్ చేయండి. లేదంటే స్విచ్ ఆఫ్ కూడా చేయిండి.

సౌకర్యవంతమైన దుస్తులు(comfortable cloths)..
స్పా సమయంలో రిలాక్స్‌గా ఉండటానికి.. వేసుకునే బట్టలు కూడా చాలా ముఖ్యం. తేలికగా.. లూజుగా రిలాక్సింగ్‌గా ఉండే దుస్తులనే ఎంచుకోండి. వేసుకున్న బట్టలు ఎంత సౌకర్యవంతంగా ఉంటే మీ ఈ ప్రయత్నం అంత బాగా పని చేస్తుంది.

నేచురల్ ప్రోడక్ట్స్(Natural Products)
బాడీ మీద, ముఖం మీద ఉండే మృతకణాలను తొలగించడానికి.. సహజసిద్ధమైన ప్రొడక్ట్స్‌నే ప్రయత్నించండి. వెనీలా, కోకో, చెర్రీ వంటి బాడీ స్క్రబ్స్ వాడితే స్కిన్ అందంగా మృదువుగా మారుతుంది. ముందుగా స్క్రబ్‌తో మొత్తం బాడీ అంతా వృత్తాకార దిశలో రుద్దుతూ స్క్రబ్ చేసుకోవాలి. కాసేపు తర్వాత క్లీన్ చేసుకోవాలి.

మాస్క్‌తో(Mask) మంచి ఫలితం
స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. సహజసిద్ధంగా దొరికే ప్రొడక్ట్స్‌నే వాడటం మంచిది. అయితే ఈ స్పాలో మీరు వాడే ప్రోడక్ట్స్ అన్ని నేచురల్‌గా తయారైనవి మాత్రమే వాడండి. అవి మీ చర్మానికి సెట్ అవుతాయో లేదో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మరిచిపోవద్దు.

Updated On 16 April 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story