మానవ శరీరంలో మూత్రపిండాల(Kidney) పాత్ర అమోఘమైంది. శరీరంలోని విషపదార్థాలను వడపోసి మూత్రం ద్వారా ఇవి బయటకు పంపిస్తాయి. ఎంజైమ్స్, హార్మోన్ల విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో మూత్రపిండంలో 12 లక్షల వరకు ఫిల్టర్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి(Blood purification) అందులోని వ్యర్థాలను తొలగిస్తాయి. దీంతో మూత్రం ద్వారా కొంత ప్రొటీన్ కూడా బయటకు వెళ్తుంది. ఇది ఎక్కువగా వెళ్తే వ్యాధికి గురవుతారని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మానవ శరీరంలో మూత్రపిండాల(Kidney) పాత్ర అమోఘమైంది. శరీరంలోని విషపదార్థాలను వడపోసి మూత్రం ద్వారా ఇవి బయటకు పంపిస్తాయి. ఎంజైమ్స్, హార్మోన్ల విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో మూత్రపిండంలో 12 లక్షల వరకు ఫిల్టర్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి(Blood purification) అందులోని వ్యర్థాలను తొలగిస్తాయి. దీంతో మూత్రం ద్వారా కొంత ప్రొటీన్ కూడా బయటకు వెళ్తుంది. ఇది ఎక్కువగా వెళ్తే వ్యాధికి గురవుతారని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లినప్పుడు కిడ్నీలు వ్యాధికి గురవుతాయని.. దీంతో కిడ్నీలు దెబ్బతింటాయని చెప్తున్నారు. సాధారణంగా ప్రతి మనిషికి 20-50 మిల్లీగ్రాముల ప్రొటీన్ మూత్రంలో వెళ్లిపోవడం సాధారణమే అయినప్పటికీ.. ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ వెళ్లిపోతే మాత్రం సదరు రోగికి కిడ్నీ సమస్యలు ఉన్నాయనిచెప్పవచ్చు. ప్రస్తుతం అత్యాధునిక ఔషధాలు, సమర్థమైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
కిడ్నీల్లోని సూక్ష్మమైన రక్తనాళికల సముదాయాన్నే ‘గ్లోమెరులార్స్’ అంటారు. వీటినే ‘ఫిల్టర్స్’(Filters)అని కూడా అంటారు. ఒక్కో కిడ్నీలో 10లక్షల నుంచి 12లక్షల వరకు గ్లోమెరులార్స్ ఉంటాయి. అయితే బరువు తక్కువగా పుట్టిన బిడ్డల్లో ఇవి తక్కువగా ఉంటాయని... బరువు పెరుగుతున్న కొద్దీ క్రమంగా ఇవి పెరుగుతాయని అన్నారు. ఏదైనా కారణం వల్ల ఈ ఫిల్టర్లు దెబ్బతింటే మూత్రం ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్ బయటికి వెళ్లిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బ తింటాయి. 3 గ్రాములకు మించి ప్రొటీన్ విడుదలైన ప్పుడు దాన్ని ‘నెఫ్రోటిక్ సిండ్రోమ్’ అంటారు. ఇది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా రావొచ్చు. రక్తంలో ప్రొటీన్ అనేది చాలా అవసరం అయితే ఇది మూత్రం ద్వారా అధిక మోతాదులో వెళ్లిపోతే కిడ్నీలు విఫలం అవుతాయంటున్నారు.
వ్యాధి లక్షణాలు తొలి దశలో తెలియవంటున్నారు. కాళ్ల వాపు, మొహం వాపు, బీపీ పెరగడం, మూత్రంలో రక్తం పోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు అని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు వంశపారంపర్యం, హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక శక్తి సంబంధ వ్యాధులు, పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం, క్యాన్సర్ వల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదముందని వైద్య నిపుణులు అంటున్నారు.