How to Store Fresh Eggs : కోడి గుడ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి బెస్ట్ టిప్స్..
గుడ్లను రిఫ్రిజిరేటర్ డోర్‌లో నిల్వ చేయడం మంచిదికాదని మనం గతంలో తెలుసుకున్నాం కదా..? మరి గుడ్లు ఎక్కవ కాలం తాజాగ ఉండాలంటే ఏం చేయాలి..? గుడ్లను నిలవచేయడం ఎలా..?

కోడి గుడ్లను రిఫ్రిజిరేటర్ డోర్ లో ఉంచడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. తలుపు తెరవడం, మూసివేయడం వలన స్థిరమైన ఉష్ణోగ్రత ఉండదు. దాంతో ఆ ప్రాతంలో ఈ అస్థిర వాతావరణం ఉండటం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో వాటిలో పెట్టిన గుడ్లు త్వరగా చెడిపోతాయి అంటున్నారు.
రిఫ్రిజిరేటర్ తలుపులో తరచుగా ఉష్ణోగ్రత మార్పులు కాలుష్యం యొక్క ప్రమాదాన్ని పెంచడమే కాకుండా.. గుడ్లు పగిలిపోయే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుందట. అందుకే గుడ్లను నిల్వ చేయడానికి ఫ్రిజ్‌లోని లోతైన, మధ్య భాగం ఉత్తమమైన ప్రదేశం అంటున్నారు నిపుణులు. అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా 2 ° C కంటే తక్కువగా ఉంటుంది.
ఇది మీ గుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తుంది, కానీ ఇతర ఆహార పదార్థాల నుండి వాసనలు గ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు వాటి నాణ్యతను కాపాడుకోవడానికి ఒక ప్రత్యేక ట్రే లేదా కంటైనర్‌ను ఉపయోగించవచ్చు “ఇలా చేయడం వల్ల గుడ్లు తాజాగా ఉంటాయి. అంతే కాదు మీ ఫ్రిజ్ కూడా తాజాగా ఎటువంటి వాసనలు లేకుండా ఉంటుంది.
గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన గుడ్లు కొన్ని రోజుల్లో పాడైపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో గుడ్లు వెంటనే చెడిపోతాయి. ఫ్రిజ్ లో కాకుండా బయట ఉంచిన గుడ్లను 1-3 వారాలలోపు ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు.
గుడ్లను నిల్వ చేయడానికి ముందు వాటిని కడగడం మంచిది కాదు. ఎందుకంటే ఇది వాటి పెంకులపై ఉన్న సహజ పూతను తొలగిస్తుంది. దాని వల్ల బ్యాక్టీరియాకు ఎక్కువగా చేరే అవకాశం ఉంది.
గుడ్లను నిలువ చేసేప్పుడు వాటి చుట్టు ఎక్కువగా ఘాటైన వాసనలు ఉన్న ఆహార పదార్ధాలు లేకుండా చూసుకోండి వాటి వల్ల గుడ్లు త్వరగా ఆ వాసనలను గ్రహించి పాడైపోతాయి. ఇదంతా ఎందుకు అనుకుంటే.. కోడి గుడ్లను అవసరమైన మేర వారానికి సరిపడా మాత్రమే తెచ్చుకోండి. వారం రోజులు గది ఉష్ణోగ్రతలో గుడ్లు పాడైపోవు.
