Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్ ఏదో తెలుసా..?
మంచి కాఫీ ఎనర్జీ బూస్టర్. ప్రపంచంలో కాఫీ ప్రియులు చాలా మంది ఉన్నారు.
మంచి కాఫీ ఎనర్జీ బూస్టర్. ప్రపంచంలో కాఫీ ప్రియులు చాలా మంది ఉన్నారు. తాగితే నిద్ర పోయి బాడీ అలర్ట్ అవ్వాలంటే కాఫీ తాగాల్సిందే. అందుకే చాలా మంది రోజుకు రెండు మూడు సార్లు కాఫీ తాగుతుంటారు. కాఫీలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాని అంతే నష్టం కూడా ఉంటుంది. అయితే కాఫీ తాగడానికి సరైన టైమ్ అంటూ ఉంది. ఆ టైమ్ లోనే కాఫీ తాగాలి అంటున్నారు ఆరోగ్య నిఫుణులు.
కాఫీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాఫీ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు.. స్లీపీ న్యూరోట్రాన్స్మిటర్ అడెనోసిన్‌ను తగ్గిస్తుంది. కెఫిలిరో కెఫిన్ నిద్రను నివారిస్తుంది. కెఫీన్ ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
కార్టిసాల్, కాఫీ : కార్టిసాల్ ఒక ఒత్తిడి హార్మోన్. శక్తి నియంత్రణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన శరీరం యొక్క కార్టిసాల్ స్థాయిలు సిర్కాడియన్ రిథమ్‌ను అనుసరిస్తాయి. ఉదయాన్నే ఈ లయ ఎక్కువ. కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కాఫీ తాగవద్దు.
కార్టిసాల్ స్థాయిలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే మార్నింగ్ 8 నుండి 9 గంటల వరకు ఆతరువాత మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కాఫీ తాగకూడదు అంటున్నారు నిఫుణులు. ఇలా తాగడం వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయట.
ఇక కాఫీ ఎప్పుడు తాగాలి అంటే.. ఉదయం 9:30 నుండి 11:30 మధ్య కాఫీ తాగాలి. మధ్యాహ్నం 1.30 నుండి 3.00 మధ్య కూడా కాఫీ తీసుకోవచ్చు. ఈ సమయంలో కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి, శరీరం శక్తిని పొందుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
కాని చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రాత్రి కూడా కాఫీ తాగుతారు. కాని రాత్రి భోజనం చేసిన తర్వాత కాఫీ తాగితే నిద్రపట్టదు. వ్యాయామం చేసే ముందు కాఫీ కూడా తాగవచ్చు. మీరు అథ్లెట్ లేదా ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే, కాఫీ ప్రీ వర్కౌట్ తాగడం మంచిది. వ్యాయామానికి 30-40 నిమిషాల ముందు కాఫీ తాగండి. ఇది ఓర్పును పెంచుతుంది. పనితీరు కూడా పెరుగుతుంది. దృష్టి కూడా మెరుగుపడుతుంది.