వయసుతో మారే అందాన్ని.. తిరిగి సంపాదించాలంటే.. ఆ వయసుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. చాలామంది ఆడవారు.. ముఖంపై చిన్న మచ్చ పడినా సరే.. దాన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే కాస్మెటిక్స్ మొదలు ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వయసుతో వచ్చే సౌందర్య సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? చర్మ సమస్యలకి దూరంగా ఉండాలంటే వీటిని పాటించండి.

20 నుంచి 30 వరకూ :
సాధారణం వయసు 20 వచ్చేసరికి.. పెద్దగా సమస్యలేం ఉండవు. దాంతో కాస్త నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ వంటి సమస్యలొచ్చినప్పుడు.. హార్మోనల్ మార్పులు వలన వస్తూ ఉంటాయి. సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఈ సమస్య దూరమవుతాయి. నిద్రపోయేటప్పుడు మేకప్ పూర్తిగా తొలించుకోవాలి. మాయిశ్చరైజింగ్ చేసుకుని పడుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అలవాటు చేసుకోవాలి.
30 నుంచి 40 వరకూ "
30లోకి అడుగుపెట్టినప్పటి నుంచే సమస్యలు మొదలవుతాయి. ఇరవైల నుంచి జాగ్రత్తలు తీసుకునేవారికి కాస్త సమస్య తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ వయసులో మీకు మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో మంచి పోషక ఆహారం తీసుకోవాలి. అలాగే చర్మ సమస్యలు ఏమీ లేకుండా కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ వయసులో ఎక్కువగా ఇంఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగినంత శ్రద్ధ తీసుకోవడం. చిన్న సమస్య వచ్చినా వెంటనే డెర్మటాలజిస్ట్ ని కలవడం మంచిది.
40 నుంచి ఆ తర్వాత వయసు వారు..
నలభై వయసులో హైడ్రేట్ అవుతుంటారు. అలాగే చర్మం సాగిపోవడం, ముడతలు పడడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ వయస్సు వారు అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా ఉండేలా చూసుకోవాలి. బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఒబేసిటీ వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటే మరింత అందంగా కనిపించొచ్చని గుర్తించాలి. చర్మం ఆరోగ్యం ఉంటుందని తెలుసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండాలి ఎందుకంటే మెనోపాజ్ స్టేజ్‌కి దగ్గరయ్యే వయసు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.