వేసవికాలంలో చాలా మందికి పాదాల పగుళ్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య కారణంగా చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకు ప్రధాన కారణం అక్కడ ఆయిల్ గ్లాండ్ ఉండకపోవడం. దీంతో పాదాల పగుళ్లు ఏర్పడుతాయి. మాయిశ్చర్ లేకపోవడం, పోల్యూషన్ ఎక్కువ కావడం, మెడికల్ కండిషన్స్ కూడా పాదాల పగుళ్లకు కారణమవుతుంటాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు వాడుతుంటారు.

వేసవికాలంలో చాలా మందికి పాదాల పగుళ్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య కారణంగా చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకు ప్రధాన కారణం అక్కడ ఆయిల్ గ్లాండ్ ఉండకపోవడం. దీంతో పాదాల పగుళ్లు ఏర్పడుతాయి. మాయిశ్చర్ లేకపోవడం, పోల్యూషన్ ఎక్కువ కావడం, మెడికల్ కండిషన్స్ కూడా పాదాల పగుళ్లకు కారణమవుతుంటాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు వాడుతుంటారు. కొన్నిసార్లు మన శరీరంలో అధికంగా వేడి ఉండడం కూడా పాదాల పగుళ్లకు దారితీస్తుంది. అలాంటి వారు మార్కెట్లో లభించే అన్ని క్రీములు ఉపయోగించడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. అలా కాకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక నిమ్మకాయని సగానికి కోసి ఆ చెక్కని పంచదారలో అద్ది దానిని పాదాలపై మృదువుగా రబ్ చేయాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రంగా కడిగేసి, ఒక క్లాత్ తో మెత్తగా అద్ది, మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా రోజూ చేస్తే ఉపశమనం ఉంటుంది. అలాగే ఒక టీ స్పూన్ వేసలీన్ ఐదు చుక్కల నిమ్మరసం కలిపి.. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో పదిహేను నిమిషాలు పాదాలు ఉండనివ్వాలి. ఆ తర్వాత క్లాత్ తో అద్ది ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. సాక్స్ వేసుకుని రాత్రంతా వదిలేయండి. రోజూ నిద్రపోయే ముందు ఇలా చేయండి.

గోరు వెచ్చని నీటిలో ఇరవై నిమిషాలు మీ పాదాలు ఉంచి మెత్తని బట్టతో అద్ది ఆ తరువాత కలబంద జెల్ అప్లై చేసి సాక్స్ వేసుకుని రాత్రంతా వదిలేయండి. ఒక అర బకెట్ గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు తేనె వేసి ఆ నీటిలో మీ పాదాలు ఉంచి ఇరవై నిమిషాలు ఉంచండి. ఆ తరువాత మృదువుగా స్క్రబ్ చేసి డెడ్ స్కిన్ ని తొలగించండి. పాదాలు శుభ్రంగా కడిగేసి, మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

ఒక బేసిన్ గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఆ నీటిలో మీ పాదాలు ఉంచి పదిహేను నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయండి. పాదాలు శుభ్రంగా కడిగేసి మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.

రోజూ పాటించాల్సిన మరిన్ని టిప్స్...
1. ఉప్పు, లేదా నిమ్మ రసం కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచుతూ ఉంటే పాదాలు క్లీన్ గా సాఫ్ట్ గా ఉంటాయి.
2. పాదాలని రెగ్యులర్ గా ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేస్తూ ఉండండి.
3. పాదాలని సరిగ్గా మాయిశ్చరైజ్ చేస్తూ ఉండండి.
4. మీకు సౌకర్యంగా ఉన్న షూస్ మాత్రమే వాడండి.
5. మరీ ఎక్కువ దూరం నడవకండి.
6. ఫుట్ మసాజ్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.

Updated On 6 Jun 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story