చేతిపై గోరింట(Henna) పట్టుకోవడం భారత స్త్రీలలో తరాలుగా వస్తున్న ఆచారం. అందులోను దక్షణ భారతంలో స్త్రీలు ఎక్కువగా గోరింటాకు వాడుతుంటారు. దీనినే.. మెహందీ, మైదాకు లాంటి పేర్లతో పిలుస్తారు.

చేతిపై గోరింట(Henna) పట్టుకోవడం భారత స్త్రీలలో తరాలుగా వస్తున్న ఆచారం. అందులోను దక్షణ భారతంలో స్త్రీలు ఎక్కువగా గోరింటాకు వాడుతుంటారు. దీనినే.. మెహందీ, మైదాకు లాంటి పేర్లతో పిలుస్తారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గోరింటాకును మర్చిపోతున్నారు ఆడవారు. చాలామంది దానికి బదులుగా రెడీమెడ్ మెహందీతో(Mehendi) పాటు నెయిల్ పాలిష్‌(Nail Polish) లాంటివి వాడుతున్నారు. కాని ఆ నెయిల్ పాలిష్ రాను రాను చేతి నుంచి ఊడిపోయి.. తినే సమయంలో ఆహారం ద్వారా కడుపులోకి చేరుతుంది. కానీ గోరింట పెట్టుకోవడం వల్ల అలాంటి సమస్యలు ఉండవు.

గోరింట ఉంచుకుంటే గోళ్లలో పేరుకున్న మురికిలోని క్రిములను చంపుతుంది. శరీరంలోని వేడిని(Body heat) తగ్గించే శక్తి కూడా గోరింటకు ఉంది.

అంతే కాదు తరుచుగా ఇన్ఫెక్షన్ కలిగించే జెర్మ్స్ గోరింటాకు వాడేవారి దరిదాపుల్లోకి కూడా రావు. అంతే కాదు గోరింటాకు వల్ల . రాష్-స్కేబీస్ వంటి సమస్యలు కూడా రావు.

వారానికి రెండు సార్లు గోరింట పెట్టుకుంటే శరీరంలో వేడితో పాటు.. పిత్తం, పిత్తం వల్ల వచ్చే వేడి కూడా హరించుకుపోతుంది. గోరింటాకులో హెన్నా టానిక్ యాసిడ్ మరియు కలరింగ్ ఏజెంట్లు ఉంటాయి. హెన్నాను ఆయుర్వేద వైద్యంలో గాయాలు, బొబ్బలు నయం చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు.

హెన్నా శరీరంలోని వేడిని చల్లబరుస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి హెన్నా దివ్య ఔషధం.

Updated On 6 May 2024 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story