ఒంటరితనం(loliness) మహా డేంజర్‌! ఎంత డేంజర్‌ అంటే రోజుకు 12 సిగరెట్లు కాలిస్తే ఏర్పడే హానీ అంత! ఈ విషయాన్ని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి(Vivek murthy) తెలిపారు. అమెరికన్లలో(Americans) రోజురోజుకీ పెరుగుతున్న ఒంటరితనం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు. పలితంగా కోట్లాది డాలర్లను వెచ్చించాల్సి వస్తుందన్నారు.

ఒంటరితనం(loliness) మహా డేంజర్‌! ఎంత డేంజర్‌ అంటే రోజుకు 12 సిగరెట్లు కాలిస్తే ఏర్పడే హానీ అంత! ఈ విషయాన్ని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి(Vivek murthy) తెలిపారు. అమెరికన్లలో(Americans) రోజురోజుకీ పెరుగుతున్న ఒంటరితనం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు. పలితంగా కోట్లాది డాలర్లను వెచ్చించాల్సి వస్తుందన్నారు. ఒంటరితనం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయని, అమెరికాలో దాదాపు సగం మంది వయోజనులు ఒంటరితనం అనుభవించిన వారేనని వివేక్‌మూర్తి తెలిపారు.

ఈ మధ్య చాలా మంది అమెరికన్లు సోషల్‌ గాదరింగ్‌లకు(social gatherinhgs) దూరంగా ఉంటున్నారని, ప్రార్థన మందిరాలకు పోవడం మానేశారని, చివరకు ఫ్యామిలీ మెంబర్లను కూడా కలవడం లేదని చెప్పారు. ఒంటరితనం పెరగడానికి ఇదే ప్రధానకారణమని సర్జన్‌ జనరల్‌ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 'ఒకే ఒక్క మెంబర్‌ ఉండే కుటుంబాలు గత 60 ఏళ్లలో రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ల వల్ల ఒంటరితనం తీవ్రమైంది. 20 ఏళ్ల కిందట అమెరికన్లు ఫ్రెండ్స్‌తో గంటసేపు గడిపితే, 2020కి వచ్చేసరికి అది 20 నిమిషాలకు తగ్గిపోయింది. 15 నుంచి 24 ఏళ్ల వయసువారు మిత్రులతో గడిపే కాలం 70 శాతం తగ్గిపోయింది.

ఒంటరితనం వల్ల అకాల మరణాల(death) ముప్పు 30 శాతం పెరుగుతుంది. పక్షవాతం, గుండెపోటు, మానసికకుంగుబాటు, ఆదుర్దా, మతిమరపు కూడా పెరుగుతాయి. సెల్‌ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోవడం కూడా ఒంటరితనానికి కారణమవుతోంది. విద్యాసంస్థలు, కార్యస్థానాలు, టెక్నాలజీ కంపెనీలు, సామాజిక గ్రూపులు, తల్లిదండ్రులు మనుషుల మధ్య సంబంధాలను పెంచడం ద్వారా ఒంటరితనాన్ని పారదోలాలి’’ అని నివేదిక పేర్కొంది. ఒంటరితనం వల్ల క్యాన్సర్‌ వ్యాధి సోకవచ్చట. ఒంటరిగా ఉంటే హార్మోన్లలో మార్పులు జరిగి, అవి క్యాన్సర్‌కు దారి తీస్తాయట!

Updated On 3 May 2023 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story