ఈ దీపావళి(Diwali) సీజన్‌లో కొత్త ఇల్లు(House) కట్టుకోవాలనుకుంటున్నారా.. కొత్త ఫ్లాట్‌ కొనాలనుకుంటున్నారా..? ఈరోజుల్లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలంటే బ్యాంకు లోన్‌కు(Bank Loan) వెళ్లలేని పరిస్థితి ఉంది. దీపావళి సందర్భంగా దేశంలోని పలు బ్యాంకులు హోంలోన్లపై వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజుల్లో రాయితీ అందిస్తున్నాయి.

ఈ దీపావళి(Diwali) సీజన్‌లో కొత్త ఇల్లు(House) కట్టుకోవాలనుకుంటున్నారా.. కొత్త ఫ్లాట్‌ కొనాలనుకుంటున్నారా..? ఈరోజుల్లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలంటే బ్యాంకు లోన్‌కు(Bank Loan) వెళ్లలేని పరిస్థితి ఉంది. దీపావళి సందర్భంగా దేశంలోని పలు బ్యాంకులు హోంలోన్లపై వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజుల్లో రాయితీ అందిస్తున్నాయి. సాధారణంగా దీపావళి సీజన్‌ వచ్చిందంటే అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్, ఇతర ఈ-కామర్స్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లు, బట్టల షాపులు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే ఇప్పడు ఆ జాబితాలో దేశంలోని ప్రముఖ్య బ్యాంకులు కూడా చేరాయి.

హోంలోన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సిబిల్‌ స్కోర్, ప్రాపర్టీ వాల్యూ, మంత్లీ ఇన్‌కం ఆధారంగా బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. ప్రముఖ బ్యాంకులు ఎంత శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నాయి.. ప్రాసెసింగ్‌ ఫీజులో ఎంత మేర కోత పెడుతున్నాయో చూద్దాం.
దీపావళి సీజన్‌లో భాగంగా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFCహోం లోన్లపై ఆఫర్స్ తీసుకొచ్చింది. హోం లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంది. పండగ ఆఫర్ కింద కేవలం 8.35 శాతం వడ్డీకే గృహరుణం వస్తుంది. ముఖ్యమైన బ్యాంకుల్లో ఇందులోనే కాస్త తక్కువ ఉంది. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ పొందే అవకాశముంది.
ప్రభుత్వ రంగా బ్యాంకైన SBI గృహరుణాలపై 65 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తోంది. ఫెస్టివల్‌ ఆఫర్‌లో భాగంగా సిబిల్ స్కోరు బాగున్న వారికి స్కోరును బట్టి వడ్డీ శాతంలో మరింత రాయితీ పొందే అవకాశం ఉంది. హోం లోన్లపై వడ్డీ రేట్లు 9.15 శాతంతో ప్రారంభమవుతున్నాయి. ఆఫర్లో బాగంగా 8.40 శాతం వడ్డీ నుంచే హోం లోన్లు ప్రారంభమవుతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఇస్తోంది. ఈ ఆఫర్‌ డిసెంబర్ 31 వరకు ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు(Punjab National Bank) కూడా ఆఫర్ తీసుకొచ్చింది. ఈ బ్యాంక్‌లో 8.40 శాతం వడ్డీతోనే గృహ రుణాలు ప్రారంభమవుతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలపై మొత్తం రాయితీ అందిస్తోంది. ఈ ఆఫర్ ఈనెల 30 వరకు ఉండనుంది

కెనరా బ్యాంకులో హోం లోన్ వడ్డీ రేట్లు 8.40 శాతంతో ప్రారంభమవుతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు నిల్‌. మరో బ్యాంక్‌.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా పండగ ఆఫర్ కింద 8.40 శాతం వడ్డీ తో గృహరుణాలు ఇస్తున్నారు. ఇంకా ప్రభుత్వ ప్రాజెక్టులు, ఫుల్లీ కంప్లీటెడ్, టేక్‌ఓవర్ హోం లోన్లకు స్పెషల్ రేటు వర్తిస్తుంది. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ ఛార్జీలు నిల్.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, అలాగే PNB హౌసింగ్ ఫైనాన్స్ కూడా స్పెషల్ హోం లోన్ ఇంట్రెస్ట్ రేట్స్‌ తీసుకొచ్చాయి. LIC దాంట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి రూ. 2 కోట్లలోపు గృహరుణాలపై వడ్డీ 8.40 శాతంగా ఉంది. సిబిల్ స్కోరు 750కు పైన ఉంటేనే ఈ ఆపర్‌ వర్తిస్తుంది. అక్టోబర్ 27 తర్వాత అప్లై చేసిన వారికి ఈ ఆఫర్ లభిస్తుంది. PNB హౌసింగ్ ఫైనాన్స్‌లో 8.50 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రాపర్టీ వ్యాల్యూలో 90 శాతం వరకు లోన్ పొందొచ్చు.

Updated On 9 Nov 2023 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story