✕
Sydney Musem : ఆ మ్యూజియం భయపెడుతుంది... ధైర్యం ఉంటేనే వెళ్లాలి..!
By EhatvPublished on 18 May 2024 1:57 AM GMT
ఇవాళ అంతర్జాతీయ మ్యూజియం డే(International Museum Day) అట! అంటే మ్యూజియంకు కూడా ఓ రోజుందన్నమాట! మ్యూజియం అంటే కత్తులు కటారులు, శిలలు శిల్పాలు, గడియారాలు, పెయింటింగులు ఉంటాయనుకుంటాం కానీ, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉంటాయి. నవ్వించేవి ఉంటాయి. భయపెట్టేవి కూడా ఉంటాయి. ఏమిటి భయపెట్టేవి కూడా ఉంటాయా? అని సందేహపడకండి.

x
Sydney Musem
-
- ఇవాళ అంతర్జాతీయ మ్యూజియం డే(International Museum Day) అట! అంటే మ్యూజియంకు కూడా ఓ రోజుందన్నమాట! మ్యూజియం అంటే కత్తులు కటారులు, శిలలు శిల్పాలు, గడియారాలు, పెయింటింగులు ఉంటాయనుకుంటాం కానీ, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉంటాయి. నవ్వించేవి ఉంటాయి. భయపెట్టేవి కూడా ఉంటాయి. ఏమిటి భయపెట్టేవి కూడా ఉంటాయా? అని సందేహపడకండి.
-
- సిడ్నీ(Sydney) నగరంలో ఉన్న ఓ ప్రదర్శనశాలను చూస్తే మీ సందేహం తీరిపోతుంది. అసలు ఇలాంటి మ్యూజియంలు కూడా ఉంటాయా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ మ్యూజియం! కొన్ని మ్యూజియంలలో అడుగుపెడితే ఆహ్లాదం కలుగుతుంది.. అదే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సందర్శిస్తే కాసింత భయం వేస్తుంది. భయంతో పాటు గగుర్పాటు కలుగుతుంది.
-
- ఎందుకంటే ఇక్కడ ఉన్నవి మనుషుల శవాలు(Dead bodies) కాబట్టి! అదేమిటీ..? శవాలతో ఎగ్జిబిషనేమిటి? అని ఎవరైనా అడిగితే , ఏం సైన్స్ ఎగ్జిబిషన్లో చూసినప్పుడు ఇక్కడ చూస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తారు నిర్వహాకులు. అయితే మనలో నెలకొన్న ఎన్నో సందేహాలకు ఈ ప్రదర్శనశాల సమాధానాలు చెబుతుంది.
-
- మన శరీరం లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది? మన అవయవాలు ఎలా పనిచేస్తాయి? కండరాల పనితీరు ఎలా ఉంటుంది? మెదడు చేసే పనేమిటి ? కాలేయం కర్తవ్యమేమిటి ? వగైరా వగైరా అనుమాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. మన బాడీపై కచ్చితంగా మనకో అవగాహన కలుగుతుంది..
-
- ఇందులో 20 మృతదేహాలున్నాయి.రెండువందలకు పైగా శరీర భాగాలున్నాయి.. ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈ ఎగ్జిబిషన్లో ఉన్న శవాలు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కావట! అంటే చనిపోయిన తర్వాత మెడికల్ కాలేజీకో.. పరిశోధనల కోసమో ఇస్తారే అలాంటివి కావన్నమాట!
-
- ఛైనాలో(China) ఫాలున్ గాంగ్ అనే ఓ నిషేధిత తెగ ఉంది. వారి మృతదేహాలట! బహుశా వారంతా మరణశిక్ష పడిన ఖైదీల శవాలు అయి ఉండవచ్చంటారు అక్కడి డాక్టర్లు. అయితే ప్రదర్శన నిర్వాహకుడు టామ్ జాలర్ వర్షన్ వేరే ఉంది. సహజంగా మరణించిన వారి శవాలను మాత్రమే ప్రదర్శనలో పెట్టామంటున్నారాయన! శవాల గొడవ ఎలా ఉన్నా.ఈ ఎగ్జిబిషన్‌ను చూసేందుకు మాత్రం జనం తండోపతండాలుగా వస్తున్నారు.

Ehatv
Next Story