అరబ్‌ దేశంలో సెక్స్‌(Romance) అంటేనే వణికిపోతున్నారు యువకులు. మగవాళ్ల శక్తికి సెక్స్ సామర్థ్యాన్ని ఒక కొలమానంగా చూస్తారు. అందుకే సెక్స్ సామర్థ్యం గురించి అబ్బాయిలు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. సాధారణంగా అరబ్(Arab) దేశాల్లో వయసు ఎక్కువగా ఉన్న మగవారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సాంప్రదాయ మందులు లేదా పిల్స్ తీసుకుంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో యూత్‌లో కూడా ఈ ట్రెండ్‌ ఎక్కువ అవుతోంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునే సంప్రదాయ ఔషధాలను వాడటం అరబ్ దేశానికి కొత్త కాదు.

అరబ్‌ దేశంలో సెక్స్‌(Romance) అంటేనే వణికిపోతున్నారు యువకులు. మగవాళ్ల శక్తికి సెక్స్ సామర్థ్యాన్ని ఒక కొలమానంగా చూస్తారు. అందుకే సెక్స్ సామర్థ్యం గురించి అబ్బాయిలు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. సాధారణంగా అరబ్(Arab) దేశాల్లో వయసు ఎక్కువగా ఉన్న మగవారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సాంప్రదాయ మందులు లేదా పిల్స్ తీసుకుంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో యూత్‌లో కూడా ఈ ట్రెండ్‌ ఎక్కువ అవుతోంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునే సంప్రదాయ ఔషధాలను వాడటం అరబ్ దేశానికి కొత్త కాదు. శృంగార కోరికలు(Sex desires) కలిగించే ఆహారం, పానీయాలు, మూలికలు(Herbs) తీసుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తుంది. పశ్చిమ దేశాలు తయారు చేసే వయాగ్రాలాంటి బ్లూ పిల్స్‌ను అరబ్ యువకులు ఎక్కువగా వాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం సెక్స్‌ బాగా చేయాలనే ఒత్తిడి వారిపై ఉండటమేనని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక మరో అంశమేంటంటే అరబ్ ప్రాంతంలో మగవారి కంటే ఆడవారికే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆడవారికి సెక్స్ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందువల్ల ఆడవారిని తృప్తి పరిచేందుకు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని మగవారు భావిస్తారు. అరబ్ జర్నల్ ఆఫ్ యూరాలజీ పరిశోధించిన ఫలితాల ప్రకారం 40శాతం సౌదీ అరేబియా యువకులు ఒక్కసారైనా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్‌ను తీసుకున్నారని వెల్లడయింది.

ఇక ఈజిప్ట్‌ దేశంలో కూడా వయాగ్రా వాడేందుకే యువత మొగ్గు చూపుతోంది. అయితే అరబ్‌ దేశంలో యువకులు సిల్డెనాఫిల్(వయాగ్రా), వర్డెనాఫిల్(Levitra), టడలాఫిల్(సియాలిస్) వంటి బ్లూ పిల్స్‌ను(Blue Pills) వాడటం గణనీయంగా పెరుగుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. మరోవైపు యెమెన్‌లో కూడా సెక్స్ సామర్థ్యం(Sex capacity) పెంచే డ్రగ్స్ వాడకం పెరుగుతోంది. ప్రధానంగా 20 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న మగవారు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్లు యెమెన్ వైద్యశాఖ వెల్లడిస్తోంది. 2015లో ఇక్కడ అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి వయాగ్రా వంటి డ్రగ్స్‌ను వాడటం మొదలుపెట్టారు.శృంగారం చుట్టూ అల్లుకున్న కొన్ని కారణాలవ వల్ల మిడిల్‌ ఈస్ట్‌లో కూడా యువత బలహీనతలకు లోనవుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. దీంతో ఇక్కడి యువత దీనిని ఎక్కువగా వాడకం ప్రారంభించారు.

మిడిల్ ఈస్ట్‌లో సెక్స్ చుట్టూ అలుముకున్న కొన్ని రకాల సామాజిక భావనల వల్ల అక్కడి యువత శృంగార సామర్థ్యాన్ని పెంచే మెడిసిన్‌ను ఆశ్రయిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సెక్స్‌లో బాగా పర్ఫాం చేయాలనే ఒత్తిడి యువకులపై అధికంగా ఉండడమే ఈ వయాగ్రాలాంటి మందులు వాడడం అధికమవుతుందని చెప్తున్నారు వైద్యరంగ నిపుణులు. బ్లూఫిల్మ్స్‌లో నటించే యువకులు చాలా సేపు సెక్స్‌ చేస్తుంటారు. అయితే యువకులు ఆ బ్లూఫిల్మ్స్‌(Blue Films) చూసి ఆ రకంగా తమ సత్తాచాటాలనుకుంటారు. బ్లూఫిల్మ్స్‌లో శృంగారంలో పాల్గొనే యువకుల మాదిరిగానే తమ భాగస్వామిని కూడా సంతృప్తి పర్చాలనుకుంటారు. నీలి చిత్రాలు చూడటం కూడా అబ్బాయిల్లో సెక్స్ సామర్థ్యంపై సందేహాలు పెంచుతోందని ఆమె అన్నారు. 'నీలి చిత్రాలు చూసి యువకులు అపోహలకు లోనవుతున్నారు. సెక్స్ సామర్థ్యం మీద వారు అంచనాలు పెంచేసుకుంటున్నారు. చివరకు నీలి చిత్రాల్లో చూపించేదే నిజమనే భావనలోకి వచ్చేస్తున్నారు. కానీ అలా చేయడం ఆచరణ సాధ్యం కాకపోవడంతో ఒత్తిడికి లోనయ్యి వయగ్రా వాడేందుకు మొగ్గుచూపుతున్నారని పరిశోధకలు చెప్తున్నారు.

అయితే కొందరు యువకులు మాత్రం తాము సెక్స్ సామర్థ్యం కోసం లేదా అంగస్తంభన సమస్యల కోసం పిల్స్ వాడటం లేదని అంటున్నారు. కొందరయితే అలాంటివి ఉన్నట్లుగా కూడా తమకు తెలియదని అన్నారు. తమ కట్టుబాట్లకు విరుద్ధం అని మరికొందరు.. ఆ విషయం గురించి మాట్లాడటానికే నిరాకరించారు. అయితే వాస్తవానికి సెక్స్ సామర్థ్యం పెంచుకునే పిల్స్ వాడే దేశాల్లో సౌదీ అరేబియా తొలి స్థానంలో ఉందనే చెప్పాలి. ఆ తర్వాత స్థానంలో ఈజిప్టు ఉన్నట్లు 2012 నాటికి ఒక రిపోర్ట్ చెబుతోంది. సౌదీ అరేబియా జనాభా 3.5 కోట్లుగా. కానీ రష్యా జనాభా సుమారు 14.41 కోట్లు. అంటే సౌదీ అరేబియా కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2021 గణాంకాల ప్రకారం ఈజిప్టులో ఏడాదికి 127 మిలియన్ డాలర్ల చొప్పున సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మందులు అమ్ముడుపోతున్నాయి. మొత్తం ఈజిప్టు ఫార్మా మార్కెట్‌లో వీటి వాటా 2.8శాతం.

Updated On 20 May 2024 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story