నిద్రపోయేటప్పుడు కాళ్లకు సాక్సులు వేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఏంటి నమ్మడం లేదా ?.. అయితే ఈ ఆర్టికల్‌ చదవండి. వెంటనే పాత సాక్స్‌ కోసం ఇల్లంతా వెతికేస్తారు. సాధారణంగా సాక్స్‌ తొడుక్కోవడం వల్ల బాడీలో హీట్‌ పెరిగిపోతుందని, మధ్యలో మెలువ వస్తూ అసౌకర్యంగా ఉంటుందని, సరిగ్గా నిద్ర పట్టదని చాలా మంది భావిస్తారు అయితే అవన్నీ అపోహలే అంటున్నారు నిపుణులు. నిజానికి సాక్స్ తొడుక్కుని నిద్రపోవడం వల్ల..

నిద్రపోయేటప్పుడు కాళ్లకు సాక్సులు వేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఏంటి నమ్మడం లేదా ?.. అయితే ఈ ఆర్టికల్‌ చదవండి. వెంటనే పాత సాక్స్‌ కోసం ఇల్లంతా వెతికేస్తారు.

సాధారణంగా సాక్స్‌ తొడుక్కోవడం వల్ల బాడీలో హీట్‌ పెరిగిపోతుందని, మధ్యలో మెలువ వస్తూ అసౌకర్యంగా ఉంటుందని, సరిగ్గా నిద్ర పట్టదని చాలా మంది భావిస్తారు అయితే అవన్నీ అపోహలే అంటున్నారు నిపుణులు. నిజానికి సాక్స్ తొడుక్కుని నిద్రపోవడం వల్ల.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు వారంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బ్లెడ్‌ సర్కులేషన్‌(Blood circulation) మెండుగా :
క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌ నివేదిక ప్రకారం.. కాళ్లకు సాక్స్‌ వేసుకుని పడుకుంటే.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తేలింది. శరీరంలో బ్లెడ్‌ సర్కులేషన్‌ మెరుగ్గా సాగితే.. అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ మెండుగా అందుతాయి. దాని వల్ల గుండె, కండరాలు చాలా సక్రమంగా పనిచేస్తాయట.

మెనోపాజ్‌ వయసు వాళ్ల (Menopause age persons) :
సాధారణం ఆడవారిలో 50 దాటిందంటే మెనోపాజ్ స్టేజ్ మొదలైపోతుంది. అలాంటి వారికి చాలా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా.. వేడి ఆవిర్లతో ఇబ్బంది పడే ఈ మెనోపాజ్‌ మహిళలు.. సాక్స్‌ వేసుకుని నిద్రపోవడం చాలా మేలు అంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల వెచ్చని పాదాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, దాంతో వారిలో మెనోపాజ్‌ హాట్‌ ఫ్లాషెస్‌ను తగ్గించడంలో ఈ సాక్స్‌ ఎంతో సహకరిస్తాయి.

మంచి నిద్ర కూడా పడుతుంది :
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సాక్స్ వేసుకుని నిద్రపోవడం అలవాటు చేసుకుంటే.. ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. చాలా మంది నిద్ర రాక.. మంచం పైనే అటు ఇటు కదులుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు సాక్స్‌ వేసుకుని పడుకోవడానికి ట్రై చేయండి. ఎన్‌సిబిఐలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. సాక్స్ వేసుకుని నిద్రపోవడం వల్ల.. నిద్ర సమస్యలు తక్కువగా తేలింది. దీని వల్ల చేతులు, కాళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బాడీలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. నిద్రపోగానే వెంటనే నిద్రపుడుతుంది.

పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాలకు మాయిచ్చరైజర్‌ అప్లై చేసుకుని.. సాక్స్‌ వేసుకుని.. ఏసీ వేసుకుని పడుకోండి మరి. లూజుగా నీటుగా ఉండే సాక్స్‌లు మాత్రమే వేసుకోవాలి. టైట్‌గా ఉండే సాక్స్‌లు వేసుకోవడం వల్ల.. రక్తప్రసరణకు ఆటంకం జరుగుతుంది. శుభ్రంగా లేని సాక్స్ వాడటం వల్ల.. అలెర్జీలు కలుగుతాయి. ఇది వేసవి కాబట్టి.. సాక్స్ వేసుకుని.. ఏసీ వేసుకుని పడుకుని ట్రై చేయండి. తేడా మీకే తెలుస్తుంది.

Updated On 19 April 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story