కలబంద చూడటానికి ఏదో ఇంటు ముందు అందానికి వేసుకునే మొక్కలా ఉంటుంది కాని.. ఆయుర్వేద ప్రపంచంలో కలబందకు ప్రత్యేక స్థానం ఉంది. దాని వల్ల చర్మ,కేశ సౌందర్యంతో పాటు.. మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాని మనం ఇన్ స్టాంట్ వాటికి అలవాటుపడి. ఎంతో విలువైన వాటిని వదిలేస్తున్నాం.

కలబంద చూడటానికి ఏదో ఇంటు ముందు అందానికి వేసుకునే మొక్కలా ఉంటుంది కాని.. ఆయుర్వేద ప్రపంచంలో కలబందకు ప్రత్యేక స్థానం ఉంది. దాని వల్ల చర్మ,కేశ సౌందర్యంతో పాటు.. మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాని మనం ఇన్ స్టాంట్ వాటికి అలవాటుపడి. ఎంతో విలువైన వాటిని వదిలేస్తున్నాం. ఈ క్రమంలో కబంధ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం.

వయసు పెరిగే కొద్ది చర్మంపైన ముడతలు పడుతూ ఉంటాయి కానీ ఇతర కారణాలు వలన కొంత మందికి ఎక్కువ వయస్సు రాకుండానే చర్మంపై ముడతలు పడి ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తారు ఈ యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది.

కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక పోషకాలతో కలిగి ఉంటుంది ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది

కలబంద గుజ్జు మొటిమలు తగ్గించడానికి చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది, చర్మంలో నీటిని పెంచుతుంది మరియు అది జిడ్డు గల చర్మాన్ని తొలగించి చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది

అలోవెరా జెల్‌, కీరా రసం, పెరుగు, రోజ్‌ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్‌, మురికి వదిలించటంలో ఈ ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది.

కలబంద కేవలం చర్మ సౌందర్యానికే కాదు మీ జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.కలబంద అనేది అనేక వాణిజ్య షాంపూ మరియు కండిషన్లలో విస్తృతంగా ఉపయోగించిన పదార్ధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చుండ్రు మరియు చుండ్రు సంబంధిత సమస్యలను శాశ్వతంగా తొలగిస్తుంది అలాగే చుండ్రు వాలా వాచే దురద వంటి సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేసి చుండ్రుని శాశ్వతంగా తొలగిస్తుంది

నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించటంలో కలబంద గుజ్జు ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ టూత్‌పేస్ట్‌లు కనబర్చే సామర్థ్యం కంటే కలబంద జెల్‌ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

Updated On 28 Aug 2023 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story