మహిళల నెలసరి (Periods) సమయంలో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో దుర్వాసన (Bad Smell) కూడా ఒకటి. దీంతో మహిళలు ఈ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటారు. అతి ముఖ్యమైన పనులున్నా వెళ్లాలా వద్దా అన్న సందేహంతో వాయిదాలు వేసుకుంటారు. దీనిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ నెలసరి సమయంలో రక్తస్రావం (Bleeding) తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా ప్రతీ ఐదు గంటలకోసారి శానిటరీ ప్యాడ్‌ను (Sanitory Pads) మార్చుకోవాలని చెప్తున్నారు
మహిళల నెలసరి (Periods) సమయంలో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో దుర్వాసన (Bad Smell) కూడా ఒకటి. దీంతో మహిళలు ఈ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటారు. అతి ముఖ్యమైన పనులున్నా వెళ్లాలా వద్దా అన్న సందేహంతో వాయిదాలు వేసుకుంటారు. దీనిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ నెలసరి సమయంలో రక్తస్రావం (Bleeding) తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా ప్రతీ ఐదు గంటలకోసారి శానిటరీ ప్యాడ్‌ను (Sanitory Pads) మార్చుకోవాలని చెప్తున్నారు. గంటల తరబడి ఒకే శానిటరీని వాడితే దుర్వాసనకు ఇది కారణమవుతుందని.. అంతేకాకుండా ఇన్‌ఫ్లెక్షన్లు (Infections) వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మార్కెట్‌లో కొన్ని ప్యాడ్లు మంచి వాసన వచ్చేవి ఉన్నా.. సువాసన కోసం వాటిలో కొన్ని రసాయనాలు వాడుతారు. రక్తస్రావంతో ఈ రసాయనాలు కూడా కలిసినప్పుడు దుర్వాసన వచ్చేందుకు ఇది కూడా ఒక కారణమంటున్నారు. ఈ ప్యాడ్స్‌కు బదులుగా కాటన్ (Cotton) లేదా మైక్రోఫైబర్‌తో (MicroFiber) తయారుచేసిన సహజసిద్ధమైన ప్యాడ్స్‌ను ఎంచుకోవాలని చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాహ్యదుస్తుల మీద ఉన్న శ్రద్ధ మహిళలకు లోదుస్తుల (UnderWears) మీద ఉండదని.. లోదుస్తులు మురికిగా ఉన్నా, నెలసరి సమయంలో సరిగా ఉతక్కపోవడంతో దుర్వాసన వచ్చే అవకాశం ఉందంటున్నారు. లోదుస్తులను శుభ్రంగా ఉతుక్కోవాలని సూచిస్తున్నారు. లోదుస్తులు అపరిశుభ్రంగా లేకుంటే అక్కడ బ్యాక్టీరియా (Bacteria) చేరి ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉందంటున్నారు. ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరబెట్టిన తర్వాతే మరోసారి ధరించాలని సూచిస్తున్నారు. ప్యాడ్స్‌తో పాటు లోదుస్తులు కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
అయితే దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు. దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer) అంటే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ లక్షణాల్లో ఇది కూడా ఒకటని చెప్తున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడితే అధిక రక్తస్రావం, అధిక దుర్వాసన వస్తుందని అంటున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు తగిన చికిత్స చేయించుకోవాలని... నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అధిక రక్త స్రావం, పసుపు లేదా ఆకుపచ్చ బ్లీడింగ్, పొత్తికడుపులో లేదా వెజైనా దగ్గర నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే గైనకాలజిస్టును ( Gynecologist) సంప్రదించాలని.. అధిక రక్తస్రావం, ఎక్కువ దుర్వాసనను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు.