వేసవి(Summer).. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి... మరోవైపు.. సాయంత్రం చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అయితే వేడిమి నుంచి తమ ముఖాన్ని(face) రక్షించుకోవడం.. అనేక సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ముఖానికి ఐస్ క్యూబ్స్ రాసుకుంటారు. అయితే కోల్డ్ థెరపీ అని పిలువబడే ఈ ఐస్ ఫేషియల్ ముఖానికి మంచిదేనా ?

వేసవి(Summer).. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి... మరోవైపు.. సాయంత్రం చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అయితే వేడిమి నుంచి తమ ముఖాన్ని(face) రక్షించుకోవడం.. అనేక సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ముఖానికి ఐస్ క్యూబ్స్ రాసుకుంటారు. అయితే కోల్డ్ థెరపీ అని పిలువబడే ఈ ఐస్ ఫేషియల్ ముఖానికి మంచిదేనా ?.. చర్మానికి మేలు చేస్తుందా ? అని ఎప్పుడైనా ఆలోచించారా ?.. సోషల్ మీడియాలో ప్రచారం అంతగా అద్భుతం కానప్పటికీ, ఫేస్ ఐసింగ్ దాని ప్రయోజనాలు ఉన్నాయని అని డార్మటాలజిస్ట్ డా. అని గుర్వీన్ వారిచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఐస్ క్యూబ్స్‌ని నేరుగా ముఖంపై రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాల గురించి డా. గుర్వీన్ ఇన్ స్టాలో చెప్పారు.

ముఖం మీద ఐస్ క్యూబ్(Ice cubes) రుద్దడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది అలాగే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఐస్ క్యూబ్‌ను రుద్దడం వల్ల రక్త నాళాలు మొదట సంకోచించబడతాయి, రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. మన శరీరం ముఖానికి ఎక్కువ రక్త ప్రవాహాన్ని కలిగిస్తుంది.

ఉబ్బరం తగ్గిస్తుంది: ఫేస్ ఐసింగ్ ముఖం పై ఆయిల్ డ్రైనేజ్.. అంటే వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కళ్ల కింద వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

క్షీణించిన రంధ్రాల పరిమాణం (తాత్కాలికం): "ఐసింగ్ వాసోకాన్స్ట్రిక్షన్‌కు కారణమవుతుంది కాబట్టి, ఐసింగ్ చేసిన వెంటనే ముఖంపై రంధ్రాలు చిన్నవిగా కనిపిస్తాయి" అయితే ఈ ప్రభావం తాత్కాలికమే. మేకప్ వేసుకునే ముందు ఇలా చేయవచ్చని డాక్టర్ గుర్వీన్ చెబుతున్నారు.

చేయదగినవి, చేయకూడనివి:

ఐస్ క్యూబ్స్ ను నేరుగా ముఖంపై పెట్టుకోవద్దు. మస్లిన్ క్లాత్ లేదా కాటన్ క్లాత్‌లో చుట్టి వాడండి.
క్యూబ్‌ను శాశ్వతంగా ఒకే చోట రుద్దవద్దు.. అటు ఇటు నెమ్మదిగా రబ్ చేస్తుండాలి.
ఫేస్ ఐసింగ్ బౌల్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, మీ ముఖాన్ని ఒకేసారి ఐదు సెకన్ల కంటే ఎక్కువసేపు అందులో ముంచకండి. “ఉదయం ఐసింగ్ చేయడానికి ఉత్తమ సమయం. గరిష్టంగా 8-10 సైకిల్‌లు చేయవచ్చు” అని డాక్టర్ గుర్వీన్ సూచించారు.
మైగ్రేన్‌లు సమస్య ఉన్నవారు ఈ పద్దతి చేయకూడదు. ఎందుకంటే ఐసింగ్ మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. ఐసింగ్ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్ తర్వాత ఉపయోగించండి.

Updated On 11 May 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story