ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ భారతదేశంలో స్టార్ట్ చేశారు. ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు అధిక మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు తేడా లేకుండా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీ బాధ్యతే. ఫోన్ కెమెరా పూర్తిగా శుభ్రంగా(Phone Camera cleaning) ఉన్నప్పుడే మీరు మంచి చిత్రాలను తీయగలరు.

ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ భారతదేశంలో స్టార్ట్ చేశారు. ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు అధిక మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు తేడా లేకుండా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీ బాధ్యతే. ఫోన్ కెమెరా పూర్తిగా శుభ్రంగా(Phone Camera cleaning) ఉన్నప్పుడే మీరు మంచి చిత్రాలను తీయగలరు. అలాగే క్లారిటీగా ఫోటో వస్తుంది. చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే ఉపయోగిస్తున్నారు. కానీ దీన్ని ఇంట్లో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను అనుసరించాలి.

కొన్ని చిట్కాలు..
1. కెమెరాను శుభ్రంగా ఉంచుకోవడానికి ముందుగా స్మార్ట్‌ఫోన్‌ను బాగా చూసుకోవాలి. అంటే ఇంట్లో లేదా ఆఫీసులో ఫోన్‌ని శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి. మురికి ప్రదేశంలో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ కెమెరాను శుభ్రంగా ఉండేలా చూసుకోవచ్చు.
2. స్మార్ట్‌ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు ఫోన్‌ను స్విచ్ ఆఫ్(Switch off) చేయండి. క్లీన్ చేయడానికి మృదువైన మైక్రోఫైబర్ వస్త్రం(Micro fiber cloth) ఉపయోగించాలి.. కఠినమైన క్లాత్ తో కెమెరాను శుభ్రం చేయవద్దు. ఇది కెమెరా గ్లాస్‌పై మరకలను కలిగిస్తుంది.
3. లెన్స్ క్లీనర్‌ను(Lens cleaner) కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా కెమెరా, ఎల్ఈడీ లైట్లు(LED Light), సెన్సార్లను శుభ్రం చేయవచ్చు. దీంతో ఫోటో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ లెన్స్ క్లీనర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
4 కెమెరాకు నేరుగా లెన్స్ క్లీనర్‌ను ఎప్పుడూ అప్లై చేయకూడదు. అది కెమెరాస, ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అలాగే, కెమెరాను శుభ్రపరిచేటప్పుడు చేతులతో ఎక్కువ ఒత్తిడి చేయవద్దు.
5. స్మార్ట్‌ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు నీటిని పొదుపుగా వాడాలి. మొత్తానికి ఫోన్‌లో నీరు చేరితే మదర్‌బోర్డు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే, కెమెరాను తడి క్లాత్ తో శుభ్రం చేయవద్దు.
6. హార్డ్ బ్రష్‌తో కెమెరాను శుభ్రం చేయవద్దు. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయడానికి బ్రష్‌ను ఉపయోగిస్తారు. అది మెత్తగా ఉంటే సమస్య లేదు. కానీ రఫ్ గా ఉంటే మాత్రం కెమెరా పాడయ్యే అవకాశం ఉది.

Updated On 27 Jun 2023 2:45 AM GMT
Ehatv

Ehatv

Next Story