పిల్లలు తల్లిదండ్రులను చూస్తు ఎదుగుతారు... వారు చేసేపనులను గమనిస్తుంటారు.. వాళ్ల మాటలను వింటుంటారు..

పిల్లలు తల్లిదండ్రులను చూస్తు ఎదుగుతారు... వారు చేసేపనులను గమనిస్తుంటారు.. వాళ్ల మాటలను వింటుంటారు.. ప్రవర్తనను రిపిట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.. ఒక రకంగా తల్లిదండ్రుల ప్రతి చర్య పిల్లలపై ప్రబావితం అవుతుంది. అందుకే పిల్లల ముందు తల్లీ తండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ప్రవర్తించాలి.

పిల్లలకు మొదటి గురువు తమ తల్లిదండ్రులే. వారి నుంచి సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకుంటుంటారు. పేరెంట్స్ చెడు అలవాట్లు ఉంటే.. పిల్లు కూడా అవే నేర్చుకుని తప్పుడు మార్గంలో వెళ్తుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు చాలాజాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

అందులో చాలా ముఖ్యమైనది కోపం. మీ కోపం పిల్లల ముందు ప్రదర్శించకండి. పదే పదే కోపం చూపించకండి. మీరు తరచుగా కోపంగా అరుస్తూ ఉంటే, వారు కూడా మీతో అదే విధంగా ఉంటారు. సమాధానం కూడా కోపంగానే చెపుతారు. మీరు మీ పిల్లల ఎమోషన్స్ ను కంట్రోల్ చేయాలంటే.. మీమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడంవ మంచిది. చాలా ఓపిగ్గా.. ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం.

పడకగది సరిగ్గా ఉంటే, పిల్లలు సరిగ్గా పెరుగుతారు. మీ పిల్లలు కూడా మీ మంచి అలవాట్లను నేర్చుకుంటారు. పొద్దున్నే లేచి అన్ని పనులు సక్రమంగా చేస్తే అవి కూడా బాగానే ఉంటాయి. మీరు క్రమశిక్షణతో ఉంటే మీ పిల్లలు క్రమశిక్షణతో ఎదుగుతారు.

చిన్న పిల్లలు ఏదైనా కొత్త విషయాన్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. అందుకే తల్లి తండ్రులు అయిన భార్యాభర్తలిద్దరూ వారి ముందు మంచి మాటలు మాట్లాడాలి. చెడ్డ పదాలు ఉపయోగించడం, గొడవలు పడటం మానుకోండి. ఇది పిల్లలను మానసికంగా ప్రభావితం చేస్తుంది. తల్లితండ్రులుగా మీ మధ్య ఏదైనా సమస్య వచ్చినా పిల్లల ముందు మాట్లాడకండి, గొడవ పడకండి

పిల్లల ముందు అబద్ధాలు చెప్పకండి, మీరు అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటే, వారు దానిని పెద్దగా తీసుకుంటారు అంతే కాదు పిల్లల ముందు నిజాయితీగా , మర్యాదగా ఉండటమే ముఖ్యమని వారు అర్థం చేసుకోలేరు.

ehatv

ehatv

Next Story