JEE Advanced 2024 : నాలుగేళ్ల పాటు 12 గంటల శ్రమ.. 17 ఏళ్ల వయసులో JEE టాపర్..!
రమేష్ సూర్య తేజ విజయ గాథను చూద్దాం. రమేష్ సూర్య తేజ(Ramesh Surya Teja), 17 ఏళ్ల వయసులో JEE Advanced 2024లో ఆలిండియా ర్యాంక్-2 సాధించాడు.

రమేష్ సూర్య తేజ విజయ గాథను చూద్దాం. రమేష్ సూర్య తేజ(Ramesh Surya Teja), 17 ఏళ్ల వయసులో JEE Advanced 2024లో ఆలిండియా ర్యాంక్-2 సాధించాడు. అతను 13 ఏళ్ల వయసు నుంచి అంటే 4 సంవత్సరాల పాటు రోజుకు 12 గంటలు అధ్యయనం చేసి ఈ విజయాన్ని సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే JEE Mainలో ఆలిండియా ర్యాంక్ 28 సాధించాడు. JEE Advancedలో 360లో 336 మార్కులు సాధించి AIR 2 ర్యాంక్ పొందాడు. సూర్య తొలుత JEE Main ప్రిపరేషన్‌లో తన సామర్థ్యం ప్రకారం పనితీరు కనబరచలేదు. దీంతో వ్యూహం మార్చుకొని పక్కాగా అమలు చేశాడు.4 సంవత్సరాలు, రోజుకు 12 గంటలు అధ్యయనం చేశాడు. సిలబస్‌ను సమగ్రంగా కవర్ చేయడం, మాక్ టెస్ట్‌లు, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేశాడు. టాపర్స్ సిఫార్సు చేసిన విధంగా, 25 నిమిషాల నిరంతర అధ్యయనం తర్వాత 5-10 నిమిషాల విరామం తీసుకోవడం వంటి టెక్నిక్‌లను అనుసరించాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కాన్సెప్ట్‌లను లోతుగా అధ్యయనం చేశాడు. తన బలహీనతలను గుర్తించడానికి, పరీక్ష వాతావరణానికి అలవాటు పడటానికి రెగ్యులర్ మాక్ టెస్ట్‌లు రాశాడు. మొదటి వైఫల్యం తర్వాత, తన అధ్యయన పద్ధతులను మెరుగుపరచడం ద్వారా అతను JEE Advancedలో అద్భుతమైన ర్యాంక్ సాధించాడు. ఒత్తిడిని ఎదర్కోవడం, మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవడం అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. "నేను 360 పాయింట్లకు 360 పాయింట్లు సాధించలేకపోయాను. JEE మెయిన్ మాక్ టెస్ట్‌లలో నేను 300 కి 300 స్కోర్ చేయలేకపోయాను, చాలా మంది విద్యార్థులు కూడా అలానే చేశారు. మా టీచర్లు మమ్మల్ని ఒత్తిడి చేసి చదువుతున్నామా లేదా అని చూసే బదులు.. మమ్మల్ని మేము నమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చారు. వారు నన్ను ప్రోత్సహించారు, నేను దానిని చేయగలనని చెప్పారు. వారు నాపై నమ్మకం పెట్టుకున్నారని తెలుసుకున్నా. ఇది నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నేను కష్టపడి పనిచేశాను" అని రమేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
