వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ(ycp) అధిష్టానం..భారీ ఎత్తున అభ్యర్థులను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మందికి స్థాన చలనం కల్పించగా, మరికొందరిని పూర్తిగా పక్కనపెట్టారు. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా..మరికొంత మంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎన్నికల బరిలోకి దించుతున్నారు. ఈ ప్రక్రియలో సీఎం జగన్(cm jagan) మరో కీలకం నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ(ycp) అధిష్టానం..భారీ ఎత్తున అభ్యర్థులను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మందికి స్థాన చలనం కల్పించగా, మరికొందరిని పూర్తిగా పక్కనపెట్టారు. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా..మరికొంత మంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎన్నికల బరిలోకి దించుతున్నారు. ఈ ప్రక్రియలో సీఎం జగన్(cm jagan) మరో కీలకం నిర్ణయం తీసుకున్నారు.

అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి ఇద్దరు మహిళా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ రెండవ జాబితాలో ఈ ఇద్దరు ఎంపీల పేర్లు ఉంటాయని పార్టీ వర్గాల సమాచారం. అనకాపల్లి(anakapalle) నుంచి సిట్టింగ్ ఎంపీ(sitting mp)గా ఉన్న భీశెట్టి సత్యవతి(Beesetti Satyavathi)ని ఈసారి అనకాపల్లి ఎమ్మెల్యే(anakapalle mla)గా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోందట. ఆమె బలమైన గవర సామాజికవర్గానికి(GAVARA COMMUNITY) చెందిన నేత. విద్యాధికురాలు. వైద్య వృత్తిలో దశాబ్దాలుగా ఉన్నారు. స్వచ్చంద సేవా కార్యక్రమాలతో డా. సత్యవతి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎంపీగా ఆమె పనితీరు పట్ల కూడా ఎలాంటి విమర్శలు లేవు. ఈ నేపథ్యంలో ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

ప్రస్తుత అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే(anakapalle sitting mla) మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath)ను చోడవరం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉందట. అనకాపల్లి సీటుకు ఎంపీ సత్యవతిని సిద్ధం చేశారని పార్టీ వర్గాల సమాచారం. మంత్రి గుడివాడ సైతం ఆమె అభ్యర్ధిత్వం పట్ల సుముఖంగా ఉండడంతో ఆయన వర్గమంతా ఆమెకు పనిచేస్తారని అంటున్నారు. దాంతో పెద్ద సంఖ్యలో ఉన్న గవర సామాజికవర్గంతో పాటు కాపు(kapu)ల మద్దతు కూడా దక్కుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది. మరోవైపు అల్లూరి జిల్లా అరకు ఎంపీ(araku mp)గా ఉన్న గొడ్డేటి మాధవి(Goddeti Madhavi)ని పాడేరు ఎమ్మెల్యే((Paderu mla)గా పోటీ చేయించాలని అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మాధవి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె పొలిటికల్ గ్రాఫ్ కూడా బాగుంది. పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే((paderu sitting mla) భాగ్యలక్ష్మి(Bhagyalaksmi) పనితీరు పట్ల సర్వే నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. ఆమెకు సొంతపార్టీ నుంచి అసమ్మతిపోరు కూడా ఉంది. దీంతో ఈసారి ఎంపీ గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. పాడేరు అసెంబ్లీ సీటుని మరోసారి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది వైసీపీ. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారగా..అరకు ఎంపీ సీటుని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు ఇస్తారని సమాచారం. మొత్తానికి ఇద్దరు మహిళా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నారనేదానిపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated On 2 Jan 2024 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story