వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) కుమారుడి పెళ్లి తేదీ ఫిక్సయ్యింది. తన కుమారుడు వై.ఎస్‌.రాజారెడ్డి-అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి(January) 18వ తేదీన జరుగుతుందని షర్మిల తెలిపారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) కుమారుడి పెళ్లి తేదీ ఫిక్సయ్యింది. తన కుమారుడు వై.ఎస్‌.రాజారెడ్డి-అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి(January) 18వ తేదీన జరుగుతుందని షర్మిల తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శుభవార్తను చెప్పారు. ఫిబ్రవరి 17వ తేదీన వివాహ(Wedding) వేడుక జరుగుతుందని తెలిపారు. మంగళవారం షర్మిల కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను(YSR Ghat) సందర్శించనున్నారు. మొదటి ఆహ్వాన పత్రికను ఘాట్‌ దగ్గర ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోబోన్నట్టు షర్మిల తెలిపారు.

Updated On 1 Jan 2024 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story