గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో గడప గడపకు కార్యక్రమాన్ని(Gadapa Gadapa Program) నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి(AP CM) వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS JAGAN) పార్టీ క్యాడర్‌కు పిలుపిచ్చారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పు అంటూ కొన్ని పత్రికల్లో , సోషల్‌ మీడియాలలో వస్తున్న వార్తలను జగన్‌ ఖండిచారు. సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్‌ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్న సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు.

గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో గడప గడపకు కార్యక్రమాన్ని(Gadapa Gadapa Program) నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి(AP CM) వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS JAGAN) పార్టీ క్యాడర్‌కు పిలుపిచ్చారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పు అంటూ కొన్ని పత్రికల్లో , సోషల్‌ మీడియాలలో వస్తున్న వార్తలను జగన్‌ ఖండిచారు. సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్‌ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్న సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నట్టు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. మంత్రివర్గంలో మార్పులతో పాటు ఇతర వదంతులపైనా ఎమ్మెల్యేలతో జగన్‌ చర్చించారు. ఎన్నికల నాటికి ఇలాంటి రూమర్లు చాలానే పుట్టుకొస్తాయని, వాటిని బలంగా తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. గడపగడపకూ కార్యక్రమానికి కొంత గ్యాప్‌ వచ్చింది. అందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడమేనన్నారు. కోడ్‌ ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. ఆ తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయని జగన్‌ వివరించారు. వీటి కారణంగానే గడపగడపకూ కార్యక్రమం కాస్త ఆలస్యమయ్యిందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్‌లో పడ్డాయని జగన్‌ వివరించారు. అది కూడా ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా అని జగన్‌ చెప్పారు.

అర్బన్‌ ప్రాంతంలో 84శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, సగటున 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగామని ధీమాగా చెప్పారాయన. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10వేల రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12 వేల రూపాయల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చామన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనంగా గెలిచామని టీడీపీ చెప్పుకుంటోందని జగన్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యాలు ఉన్నాయని, విపక్ష నేతలందరూ కలిశారని, మనం ఒక్కరిమే పోటీకి దిగామని, అయినప్పటికీ టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదన్నారు. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉండటం వల్ల గెలిచిందంతే అన్నారు. ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారని జగన్‌ తెలిపారు. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నామని, వారంతా గజ దొంగల ముఠా అని జగన్‌ అన్నారు. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలన్నారు.

Updated On 3 April 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story