ఇప్పటికే నాలుగు జాబితాలను వైసీపీ (YCP) విడుదల చేసింవి. 59 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులను చేపట్టింది. తొమ్మిది పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ మార్పులు చేసింది. మరో రెండు, మూడు రోజుల్లో తుది జాబితాను ఖరారు చేసేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే నాలుగు జాబితాలను వైసీపీ (YCP) విడుదల చేసింది. 59 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులను చేపట్టింది. తొమ్మిది పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ మార్పులు చేసింది. మరో రెండు, మూడు రోజుల్లో తుది జాబితాను ఖరారు చేసేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండే అవకాశం ఉంది.

గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. 150కి పైగా స్థానాలు తమ ఖాతాల్లో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. దీని కోసం ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కన పెట్టేస్తున్నారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కకు తప్పిస్తున్నారు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు. ఇందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలని చూడకుండా మొహమాటమే లేకుండా అభ్యర్థులను సీఎం జగన్‌ (CM Jagan) మార్చేస్తున్నారు. జనసేన-టీడీపీ (Janasena-TdP) సీట్ల సర్దుబాటు కాకముందే తుదిజాబితాను ప్రకటించి ప్రజాక్షేత్రంలో వెళ్లాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో వైసీపీ తుదిజాబితాపై ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

Updated On 23 Jan 2024 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story