వైసీపీలో ఇంఛార్జీల మార్పు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు లిస్టులను ప్రకటించిన వైసీపీ.. తాజాగా ఐదో లిస్ట్ కసరత్తు చేస్తోంది. ఐదో జాబితా ఫైనల్ అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి..రేపో మాపో ఐదో జాబితా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు నేతలు క్యూకడుతున్నారు.

వైసీపీలో ఇంఛార్జీల మార్పు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు లిస్టులను ప్రకటించిన వైసీపీ.. తాజాగా ఐదో లిస్ట్ కసరత్తు చేస్తోంది. ఐదో జాబితా ఫైనల్ అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి..రేపో మాపో ఐదో జాబితా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు నేతలు క్యూకడుతున్నారు.

వైసీపీ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 10 పార్లమెంట్, 58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసి, అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. తాజాగా ఐదో జాబితా(Fifth List)ను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన సెగ్మెంట్స్ పై ఫోకస్ పెట్టింది. మార్పులు జరగాల్సి ఉన్నచోట కొత్తగా అవకాశం దక్కేవారిని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను క్యాంప్ ఆపీస్ కు పిలిచి మాట్లాడుతోంది. ఎన్నికల్లో కలిసి పని చేయాలని తాజా, మాజీ నేతలకు సూచిస్తోంది. ఇప్పటి వరకు చాలా స్థానాల్లో అభ్యర్థుల మార్పులు జరిగినా..అది కూడా ఫైనల్ కాకపోవచ్చని చెబుతోంది వైసీపీ అధిష్టానం. అభ్యర్థుల పనితీరు సరిగా లేకపోయినా..ప్రజల్లో సానుకూలత కనిపించకపోయినా..మళ్లీ మార్పులు తప్పవని హెచ్చరిస్తోంది. ఇప్పటికే మార్పులు చేసిన 5 నియోజకవర్గాల విషయలో వైసీపీ పునరాలోచన చేస్తోందట. చిలుకలూరిపేట, ప్రతిపాడు, రేపల్లెతోపాటు విజయవాడ వెస్ట్ ఇంఛార్జీలను మార్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు..రేపోమాపో ప్రకటించబోయే ఐదో జాబితానే ఫైనల్ అనే సంకేతం అటు ప్రజలు..ఇటు పార్టీ నేతల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ (Madishetti Venugopal) సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం కీలకంగా మారింది. అదే స్థానానికి ఇటీవల బూచేపల్లి ‎శివప్రసాద్ రెడ్డిని ఇంఛార్జీగా నియమించిన సంగతి తెలిసిందే. మదిశెట్టి వేణుగోపాల్‎కు ఎంపీగా అవకాశం ఇస్తామని చెప్పింది. అయితే..దీనిపై ఓ క్లారిటీ రాలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే (Visakha South MLA) వాసుపల్లి గణేష్(Vasupalli Ganesh) కూడా సీఎం ఆఫీస్‎కు వచ్చారు. ఈసారి టికెట్ ఇవ్వలేమని గణేష్ కు చెప్పేందుకే పార్టీ పెద్దలు పిలిచారని సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ భరత్(MLC Bharat), బనగానెపల్లి ఎమ్మెల్యే(Banaganepalli MLA) కాటసాని రాంరెడ్డి(Katasani Ramreddy), నూజివీడు ఎమ్మెల్యే(Nujiveedu MLA) మేక వెంకటప్రతాప్ అప్పారావు(Meka Venkatapratap Apparao), విశ్వరూప్(Vishwarup)..మొదలైన నేతలు సీఎం జగన్‎ని కలుసుకున్నవారిలో ఉన్నారు. మంత్రి నారాయణస్వామి కూడా ఆయన కుమార్తెతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఈసారి తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని ఇటీవల వైసీపీ అధిష్టానం ఎదుట నారాయణస్వామి ప్రతిపాదనలు పెట్టారు. గురజాల ఎమ్మెల్యే (Gurjala MLA) కాసు మహేష్ రెడ్డి (Kasu Mahesh Reddy) సైతం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గురజాల స్థానాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (MLC Janga Krishnamurthy) ఆశిస్తుండటంతో చర్చలు జరిపేందుకే కాసు మహేష్ రెడ్డిని పిలిపించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేయడంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated On 23 Jan 2024 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story